Ice Cream : వేసవిలో ఐస్ క్రీమ్ లు అతిగా తినేస్తున్నారా? అయితే జాగ్రత్త!

ఐస్ క్రీంలు అతిగా తింటే మెదడుకు హానికలుగతుంది. ఒక పరిశోధన ప్రకారం, సంతృప్త కొవ్వు , చక్కెరతో కూడిన ఆహారం జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందని తేలింది. ఐస్ క్రీం తినడం వల్ల దానిప్రభావం మెదడుపై పడి జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదము లేకపోలేదు.

Ice Cream : వేసవిలో ఐస్ క్రీమ్ లు అతిగా తినేస్తున్నారా? అయితే జాగ్రత్త!

Ice Cream (3)

Updated On : April 5, 2022 / 10:52 AM IST

Ice Cream : వేసవిలో ఐస్‌క్రీములు తినేందుకు అంతా ఆసక్తి చూపిస్తుంటారు. ఎండ ధాటి నుంచి ఐస్ క్రీంలు తక్షణ ఉపశమనం కలిగిస్తాయన్న ఉద్దేశంతో అదేపనిగా లాగించేస్తుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా ఐస్ క్రీంలు తింటూ వేడినుండి ఉపశమనం పొందుతుంటారు. అయితే అప్పటికప్పుడు ఐస్ క్రీంలు తినటం వల్ల శరీరంపై ప్రభావం చూపకపోయినప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం వీటివల్ల రకరకాల అనర్థాలు, ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణలు హెచ్చరిస్తున్నారు. చాలా మంది రోజులో 3 నుండి 4 ఐస్ క్రీం లు తినేస్తుంటారు. ఇలా తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

ఐస్ క్రీంలో పాలు, చాక్లెట్, అనేక రకాల డ్రైఫ్రూట్స్, చెర్రీస్ వంటివి వాడతారు. మితిమీరి ఐస్‌క్రీములు తింటే దీర్ఘకాలంలో స్థూలకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఐస్ క్రీమ్‌లలో అధిక మోతాదులో చక్కెరలు స్థూలకాయానికి దారి తీస్తాయి. ఐస్ క్రీమ్ ఆకర్షణీయంగా ఉండేందుకు దానిపై రకరకాల రసాయనిక ఫ్లేవర్లను వినియోగిస్తారు. వీటిని తినటం వల్ల ఆరోగ్యానికి చేటు కలుగుతుంది. ఇలాంటి వాటిని తింటే పేగుల్లో సమతుల్యత దెబ్బతిని, జీర్ణకోశ సమస్యలూ తలెత్తే ప్రమాదం ఉంటుంది. పాలు, చాక్లెట్, అనేక రకాల డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ మొదలైన వాటిని ఐస్ క్రీంలో ఉయోగించటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఐస్ క్రీం ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగటం మాత్రం ఖాయం.

ఒక రోజులో రెండు మూడు ఐస్ క్రీములు తింటే, 1000 కంటే ఎక్కువ కేలరీలు శరీరంలోకి వెళతాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. ఐస్‌క్రీమ్‌లో పిండి పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అధికంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తీసుకోవడం ద్వారా, బెల్లీ ఫ్యాట్‌ పెరుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని ఐస్ క్రీంలు అతిగా తినటం వల్ల పెరుగుతుంది. ఐస్‌క్రీమ్‌లో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఐస్‌క్రీమ్ ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయి పెంచుతుంది. అధిక రక్తపోటు, అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజూ ఐస్‌క్రీం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి, ఒక కప్పు వనిల్లా ఐస్‌క్రీమ్‌లో 10 గ్రాముల వరకు ధమనులకు అడ్డుపడే సంతృప్త కొవ్వు ,తోపాటు 28 గ్రాముల చక్కెర ఉంటుంది.

ఐస్ క్రీంలు అతిగా తింటే మెదడుకు హానికలుగతుంది. ఒక పరిశోధన ప్రకారం, సంతృప్త కొవ్వు , చక్కెరతో కూడిన ఆహారం జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందని తేలింది. ఐస్ క్రీం తినడం వల్ల దానిప్రభావం మెదడుపై పడి జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదము లేకపోలేదు. ఐస్‌క్రీమ్‌లో చాలా చక్కెర ఉంటుంది. దానిని తీసుకున్న తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఐస్‌క్రీమ్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా జీర్ణం కాకపోవడం వల్ల రాత్రిపూట ఐస్ క్రీం తిన్న తర్వాత నిద్రపోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు.

వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కొబ్బరినీరు, నిమ్మరసం, మజ్జిగ వంటి పానీయాలను సేవించడం ఉత్తమం. ఐస్‌క్రీములు, కూల్‌డ్రింక్స్‌ జోలికి వెళ్ళకుండా ఆరోగ్యకరమైన పానీయాలను సేవించటం మంచిది.