Liver : కాలేయ కొవ్వుకు దారితీసే ఈ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు!

ఆల్కహాల్ అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. వాటిలో ప్రధానమైనది కాలేయ సమస్యలు. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అప్పుడప్పుడు మద్యపానం పర్వాలేదు. కానీ కాలేయ కొవ్వును వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతిగా తాగడం మానుకోవాలి.

Liver : కాలేయ కొవ్వుకు దారితీసే ఈ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు!

Liver

Updated On : July 26, 2022 / 1:04 PM IST

Liver : కాలేయం శరీరం పనిచేయటానికి అవసరమైన 500కి పైగా విధులను నిర్వహిస్తుంది. కాలేయం చేసే ఈ కార్యకలాపాలు ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి. అందువల్ల కాలేయం విషయంలో సరైన సంరక్షణ, శ్రద్ధకు అవసరం. అయితే కాలేయం చాలా తక్కువ మొత్తంలో కొవ్వును కలిగి ఉంటుంది, కొన్ని జీవనశైలి మార్పులు కాలేయ కొవ్వు పెంచటంలో దోహదపడతాయి, దీనివల్ల కాలేయం దెబ్బతింటుంది. టైప్-2 మధుమేహం, అధిక కొవ్వు ఆహారం, అధిక కొలెస్ట్రాల్ వంటి కారణాల వల్ల కాలేయంలో కొవ్వులు పెరగటనికి ప్రధాన కారకాలు. ఇవి కాలేయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మద్యపాన అలవాట్లు. అతిగా తాగడం వల్ల కాలేయ కొవ్వు ఏర్పడుతుంది. కొన్ని రకాల డ్రింక్స్ దీనికి కారణమౌతాయి. అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

షుగర్ ఉన్న వస్తువులను తాగడం మానేయండి ; చక్కెర మీ కాలేయాన్ని మరింత కొవ్వును ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, కాబట్టి చక్కెరను కలిగి ఉన్న పానీయాలు కాలేయ కొవ్వు ఉత్పత్తి పేరుకుపోవడాన్ని ప్రేరేపిస్తాయి. చక్కెర ఉన్న పానీయాలు ఎక్కువ కాలం తీసుకుంటే, కాలేయం కూడా దెబ్బతింటుంది. అందువల్ల, కాలేయంలో కొవ్వును వదిలించుకోవాలనుకుంటే చక్కెర ఉన్న పానీయాలను తగ్గించాలి.

ఆల్కహాల్‌కు నో చెప్పండి ; ఆల్కహాల్ అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. వాటిలో ప్రధానమైనది కాలేయ సమస్యలు. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అప్పుడప్పుడు మద్యపానం పర్వాలేదు. కానీ కాలేయ కొవ్వును వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతిగా తాగడం మానుకోవాలి. అధికంగా తాగడం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి రావడమే కాకుండా ఆల్కహాలిక్ లేని ఫ్యాటీ లివర్ సమస్యలకు దారితీస్తుంది.

ఆహారంలో గ్రీనీ వెజిటిబుల్స్ ; కాలేయం కొవ్వును తొలగించడంలో సహాయపడటానికి రోజువారి ఆహారానికి బ్రోకలీ వంటివాటిని జోడించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్రోకలీలో ఇండోల్ అనే సమ్మేళనం ఉంది, ఇది కాలేయ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆల్కహాల్
వినియోగాన్ని పరిమితం చేయడం మాత్రమే కాకుండా, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి మంచి ఆహారం తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. రోజువారీ ఆహారంలో కాలేయానికి అనుకూలమైన ఆహారాలను తీసుకోవటం మంచిది.

ఎనర్జీ డ్రింక్స్ కు గుడ్ బై చెప్పండి ; ఎక్కువ చక్కెరను కలిగి ఉన్న పానీయాల వినియోగం కాలక్రమేణా కాలేయ కొవ్వు స్థాయిలను ప్రభావితం చేస్తాయి. కాలేయానికి హాని కలిగించే భారీ చక్కెరను కలిగి ఉండే పానీయాలను సేవించటపోవటం మంచిదని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి ఎక్కువగా దోహదపడే వాటిలో కూల్ డ్రింక్స్ కూడా ఒకటని గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత వరకు వీటిని సేవించకుండా ఉండటం మంచిది.

ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు తాగొద్దు ; తప్పనిసరిగా నో చెప్పాల్సిన మరొక పానీయం ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు. చక్కెరలు సహజంగా ఉన్నప్పటికీ , ఇవి సాధారణంగా చక్కెరలతో నిండి ఉంటాయి. వాటిలో చాలా వరకు ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటాయి. ఫ్రక్టోజ్ కాలేయంలో అధికంగా చేరితే కాలేయం దానిని కొవ్వుగా మారుస్తుంది. అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ తీసుకోవడం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ కి దారి తీస్తుంది. సాధ్యమైనంత వరకు ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ లకు బదులుగా పండ్లను నేరుగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.