Cholesterol : ఉల్లి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుందా?

ఉల్లి వల్ల.. మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా ప్రయోజనాలు పొందవచ్చునని ఇప్పటికే అనేక పరిశోధనల్లో తేలింది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, బరువు పెరగకుండా.. జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

Cholesterol : ఉల్లి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుందా?

onions

Cholesterol : దాంతో మన శరీరానికి ఆక్సిజన్ సరఫరా కూడా సరిగా జరుగదు. అలాంటి సందర్భాల్లో గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే గుండె ఆరోగ్యం బాగుండాలంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచాలి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించాలి. ఇదంతా జరుగాలంటే కేవలం సరైన డైట్ వల్లే సాధ్యపడుతుందంటున్నారు పరిశోధకులు.

READ ALSO : Eating Fast : ఆహారాన్ని వేగంగా తినటం వల్ల బరువు పెరుగుతారా ?

మంచి భోజనమే మంచి కొలెస్ట్రాల్ స్థాయిని కాలేయానికి చేర్చుతుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చెడు కొవ్వు శాతం తగ్గి, మన శరీరానికి కావాల్సిన మంచి కొవ్వు తగినంత పెరుగుతుందని ఇప్పటివరకు మనకు తెలుసు. అయితే ఇలా చెడు కొవ్వును తగ్గించే దిశగా తల్లి లాంటి ఉల్లి కూడా చేరుతుందంటున్నాయి ఈ పరిశోధనలు.

READ ALSO : Hot Water : పొట్ట శుభ్రతకు, బరువు తగ్గేందుకు.. గోరు వెచ్చని నీరు ఎంతో మేలు

పరిశోధనఏంటంటే…

రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ జర్నల్.. ఫుడ్ అండ్ ఫంక్షన్ ప్రచురించిన పరిశోధన ప్రకారం ఎర్ర ఉల్లిపాయలు తినడం గుండె ఆరోగ్యానికి మంచిదని తేల్చారు. పరిశోధనాబృందం చిట్టెలుకల మీద ఈ పరిశోధన జరిపింది. మామూలు ఆహారం తినే ఎలుకల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా పెరుగడం గమనించారు. అంతేకాదు.. ఉల్లిపాయ సారాన్ని తిన్న ఎలుకల్లో ఈ స్థాయి తగ్గడం గమనించారు. అయితే ఉల్లిపాయ వినియోగ ప్రభావాన్ని పూర్తిగా నిరూపించడానికి అధ్యయనానికి మరింత సమయం కావాలంటున్నారు పరిశోధకులు.

READ ALSO : Fenugreek Water : కొవ్వును కరిగించటంతోపాటు, బరువు తగ్గించే మెంతుల నీరు! ఎలా తయారు చేసుకోవాలంటే ?

మరింత మేలు..

ఉల్లి వల్ల.. మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా ప్రయోజనాలు పొందవచ్చునని ఇప్పటికే అనేక పరిశోధనల్లో తేలింది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, బరువు పెరగకుండా.. జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవాళ్లు ఈ విషయంగా మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే మధుమేహులకుఉల్లిగడ్డలుసహాయపడుతాయి.

READ ALSO : Lose Fat : కొవ్వులు కరగాలంటే వారంలో ఒకరోజు కేలరీలు తగ్గిస్తే సరిపోతుందా?

ఎందుకంటే ఉల్లిగడ్డల్లోగ్లైసెమిక్ ఇండెక్స్ 10 మాత్రమే ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు కూడా చాలా తక్కువ. కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయలు అద్బుతంగా పని చేస్తాయి. ఆహారంలో ఉల్లిపాయ చేర్చుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు.. శరీరంలో ఉన్న బాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. అందుకే సలాడ్స్లలో,శాండ్ విచ్లలో కూడా పచ్చి ఉల్లిపాయను చేర్చుకోవడమంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తపడ్డట్టేనని సూచిస్తున్నారు అధ్యయనకారులు.