China HMPV Deadly Virus : కోవిడ్ తర్వాత ఐదేళ్లకు చైనాలో మరో డేంజరస్ వైరస్ విజృంభణ.. నిండిపోతున్న ఆస్పత్రులు..!

China Faces Deadly Virus HMPV
China HMPV Deadly Virus : ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఐదేళ్లకు చైనాను మరో డేంజరస్ వైరస్ బెంబేలిత్తిస్తోంది. హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV)తో సహా అనేక వైరస్‌లు డ్రాగన్ దేశాన్ని వణికిస్తున్నాయి. అధిక ఆసుపత్రుల్లో వైరస్ కేసుల పెరుగుదలతో ఆరోగ్య అధికారులలో తీవ్ర ఆందోళనలను రేకిత్తిస్తోంది. చైనా ప్రస్తుతం హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) కేసుల పెరుగుదలతో పోరాడుతోంది.
Read Also : China HMPV Outbreak : చైనాలో వేగంగా విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్.. లక్షణాలు, నివారణ చర్యలేంటి?
సోషల్ మీడియా పోస్ట్‌లు, నివేదికలు వైరస్ వేగంగా దేశంలో వ్యాప్తి చెందుతుందని సూచిస్తున్నాయి. వైరస్ వ్యాప్తితో అనేక ఆసుపత్రులు, శ్మశానవాటికలను ముంచెత్తుతున్నాయి. “ఇన్‌ఫ్లుఎంజా ఎ, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 వంటి బహుళ వైరస్‌ల పెరుగుదలను చైనా ఎదుర్కొంటోంది. భారీగా ఆస్పత్రులు, శ్మశాన వాటికలు నిండిపోతున్నాయని ‘SARS-CoV-2 (Covid-19)’ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్టు పేర్కొంది.
పిల్లల ఆస్పత్రులపై తీవ్ర ఒత్తిడి :
న్యుమోనియా కేసులు, “వైట్ లంగ్” పరిస్థితులతో పిల్లల ఆస్పత్రులు ముఖ్యంగా ఒత్తిడికి గురవుతున్నాయని పోస్ట్ తెలిపింది. ఈ వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందడం వల్ల చైనా అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని కొందరు పేర్కొన్నారు. అయినప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఫ్లూ-వంటి లక్షణాలకు కారణమయ్యే హెచ్ఎంపీవీ కోవిడ్-19 మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత వైరస్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించడానికి ఆరోగ్య అధికారులు రంగంలోకి దిగారు.
న్యుమోనియా కేసులపై కొత్త మానిటరింగ్ సిస్టమ్ టెస్టింగ్ :
న్యుమోనియా కేసులను పర్యవేక్షించడానికి చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ కొత్త వ్యవస్థను ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. మానిటరింగ్ సిస్టమ్ అభివృద్ధి చెందుతున్న వ్యాధికారకాలను నియంత్రించిడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఐదేళ్ల క్రితం కోవిడ్ -19 వైరస్ మొదటిసారి ఉద్భవించినప్పుడు సంసిద్ధత లేకపోవడమే అతి వ్యాప్తికి దారితీసింది.
నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేకించి డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 22 మధ్య అంటువ్యాధుల పెరుగుదల ధోరణిని సూచించింది. ఈ కేసులను నివేదించడానికి ల్యాబరేటరీలకు వ్యాధి నియంత్రణ ఏజెన్సీలు వాటిని ధృవీకరించే ప్రక్రియపై పనిచేస్తోంది.
ప్రమాదంలో 14 ఏళ్లలోపు పిల్లలు :
ఉత్తర చైనాలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ ముఖ్యంగా 14 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై తీవ్ర ప్రభావితం చేస్తోంది. షాంఘై ఆసుపత్రికి చెందిన ఒక శ్వాసకోశ నిపుణుడు.. నేషనల్ బిజినెస్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంటీవైరల్ ఔషధాల విచక్షణారహిత వినియోగాన్ని నివారించాలని ప్రజలకు సూచించారు.
హెచ్ఎంపీవీతో పోరాడండి. ఎందుకంటే వైరస్‌కు వ్యాక్సిన్ లేదు. ఆ వైరస్ లక్షణాలు సాధారణ జలుబును పోలి ఉంటాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ బారిన పడకుండా సాధ్యమైనంతవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచనలు చేస్తున్నారు.
Read Also : HMVP Virus : చైనాను వణికిస్తున్న మరో మహమ్మారి..! HMVP వైరస్ అంటే ఏమిటి? లక్షణాలు ఏంటి?