Blood Cancer : బ్లడ్ క్యాన్సర్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముందస్తు సంకేతాలు !
బ్లడ్ క్యాన్సర్ అనేది రక్తంలో ఏర్పడే కణజాలాల క్యాన్సర్, ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడే శరీర సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. తీవ్రమైన మరియు ప్రాణాంతక అనారోగ్య పరిస్ధితికి దారితీసేలా చేస్తుంది. శరీరంలోని రక్త కణాల సాధారణ ఉత్పత్తి ,పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది.

blood cancer
Blood Cancer : బ్లడ్ క్యాన్సర్ అనేది ఎముక మజ్జలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్, అక్కడే రక్తం ఉత్పత్తి అవుతుంది. ఈ తరహా క్యాన్సర్ రక్త కణాల పనితీరును ప్రభావితం చేస్తుంది. రక్త క్యాన్సర్‌లో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి, అవి లుకేమియా, లింఫోమా, మైలోమా క్యాన్సర్లు. రక్త క్యాన్సర్‌లలో, అసాధారణ రకం రక్త కణం యొక్క అనియంత్రిత పెరుగుదల ద్వారా సాధారణ రక్త కణాల అభివృద్ధి ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది.
READ ALSO : Benefits Of Garlic : క్యాన్సర్ నివారణకు, జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపరచటంలో వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు !
బ్లడ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు జ్వరం, చలి, అలసట, బలహీనత, బరువు తగ్గడం, రక్తహీనత, కీళ్ల నొప్పులు వంటివి ఉంటాయి. ముందస్తుగా గుర్తించడం వల్ల సమర్థవంతమైన చికిత్సను పొందేందుకు అవకాశం ఉంటుంది. కీమోథెరపీ, రేడియేషన్, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్, సర్జరీ, ఇమ్యునోథెరపీ వంటి కొన్ని చికిత్సా పద్ధతులు అనుసరిస్తున్నారు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నవారికి మద్దతుగా, లక్షణాలు , చికిత్స గురించి అందరిలో అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే 28న ప్రపంచ రక్త క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుతున్నారు.
బ్లడ్ క్యాన్సర్ అనేది రక్తంలో ఏర్పడే కణజాలాల క్యాన్సర్, ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడే శరీర సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. తీవ్రమైన మరియు ప్రాణాంతక అనారోగ్య పరిస్ధితికి దారితీసేలా చేస్తుంది. శరీరంలోని రక్త కణాల సాధారణ ఉత్పత్తి ,పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. 2020లోనే ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ల కొత్త బ్లడ్ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని
అంచనా వేశారు. తాజాగా గ్లోబోకాన్ డేటా తో ఈ సమస్య మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
READ ALSO : Oral Cancer : నోటి క్యాన్సర్‌కు కారణాలు ? దానిని నివారించడానికి చిట్కాలు !
దీనిని ఎదుర్కోవడానికి, సకాలంలో రోగ నిర్ధారణ , సత్వర చికిత్స ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు. ముందస్తు ఆరోగ్య హెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో అప్రమత్తంగా ఉండటం
అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
బ్లడ్ క్యాన్సర్ యొక్క 7 కీలకమైన సంకేతాలు ;
1. బరువు తగ్గడం ;
అనుకోకుండా బరువు తగ్గడం, ఆహారం లేదా వ్యాయామంలో ఎటువంటి మార్పులు లేకుండా బరువు తగ్గిపోతే తప్పనిసరిగా అనుమానించాల్సిందే. ఈ పరిస్ధితి రక్త క్యాన్సర్‌కు ప్రమాదకరమైన సూచన కావచ్చు. గణనీయంగా, చెప్పలేని విధంగా బరువు తగ్గితే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
READ ALSO : Broccoli Cure Breast Cancer : బ్రోకలీ రొమ్ము క్యాన్సర్‌ను నయం చేస్తుందా? అధ్యయనాలు ఏమి చెబుతున్నాయంటే ?
2. ఎముకలు, కీళ్ల ల్లో అసౌకర్యం ;
ఎముకలు లేదా కీళ్లలో, ముఖ్యంగా వెనుక లేదా తుంటిలో నిరంతర నొప్పి ఉంటే ఏమాత్రం విస్మరించకూడదు. ఈ ప్రాంతాల్లో అసౌకర్యాన్ని కలిగి ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం
చాలా ముఖ్యం.
3. నిరంతర అలసట ;
తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా విపరీతమైన అలసట, బలహీనంగా అనిపించడం బ్లడ్ క్యాన్సర్‌కు సంకేతం. నిరంతర అలసటను తీవ్రంగా పరిగణించడం చాలా అవసరం.
ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్ కు ఇది అత్యంత సాధారణ ముందస్తు హెచ్చరిక సంకేతాలలో ఒకటి.
READ ALSO : Bowel Cancer : ప్రేగు క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు !
4. సులభంగా గాయాలు, అధిక రక్తస్రావం
స్పష్టమైన కారణం లేకుండా కనిపించే గాయాలు, చిన్న దెబ్బతగిలినా ఎక్కువసేపు రక్తస్రావం అవుతుండడం అనేది రక్త క్యాన్సర్‌తో ముడిపడి ఉండటాన్ని సూచిస్తుంది. గాయాలైనప్పుడు నిరంతర రక్తస్రావం ఎదుర్కొంటే వైద్యులను సంప్రదించటం మంచిది.
5. ఊపిరి ఆడకపోవడం
సాధారణ పనులు చేస్తున్న సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస ఆడకపోవడం బ్లడ్ క్యాన్సర్ లక్షణం. శ్వాసను పీల్చటానికి ఇబ్బంది పడుతుంటే , ఛాతీలో అసౌకర్యాన్ని
ఎదుర్కొంటే, వెంటనే వైద్యసహాయం పొందడం మంచిది.
READ ALSO : Prevent Skin Cancer : ఎండవేడి కారణంగా వచ్చే చర్మ క్యాన్సర్‌ను నివారించడానికి చిట్కాలు, జాగ్రత్తలు !
6. తరచుగా ఇన్ఫెక్షన్లు ;
బ్లడ్ క్యాన్సర్ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. తరచుగా శ్వాసకోశ , మూత్ర మార్గపు ఇన్ఫెక్షన్లు వంటి అంటువ్యాధులతో
బాధపడుతుంటే అది అంతర్లీనంగా రక్త క్యాన్సర్‌కు సూచనగా భావించాలి.
7. శోషరస కణుపులు ;
వాపు శోషరస గ్రంథులు, మెడ, చంకలు, గజ్జలలో గ్రంధుల వాపు ఉంటే రక్త క్యాన్సర్ కావచ్చు. ఈ ప్రాంతాల్లో నిరంతర వాపు,సున్నితత్వం కలిగి ఉంటే, ఆరోగ్య నిపుణులను
సంప్రదించడం చాలా అవసరం.
READ ALSO : Cancer Heart Disease Vaccines : క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు!
ఈ సంకేతాల గురించి తెలుసుకోవడం ద్వారావైద్య సంరక్షణను పొందేందుకు, ప్రాణాలను రక్షించుకోవడానికి వీలుకలుగుతుంది. సకాలంలో రోగనిర్ధారణ, సమర్థవంతమైన చికిత్స రక్త
క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.