Warning signs your home : ఇల్లు చిందరవందరగా ఉంటే మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందట
ఇల్లు చిందరవందరగా ఉంటే మనసు గజిబిజిగా అనిపిస్తుంది. ఏదో ఆందోళనగా, ఒత్తిడిగా ఉంటుంది. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే మానసిక ఆరోగ్యం సరిగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Warning signs your home
Warning signs your home : ఇల్లు చిందరవందరగా ఉంటే మనసంతా ఏదో చిరాగ్గా అనిపిస్తుంది. అదే ఇల్లు పరిశుభ్రంగా ఉంటే హాయిగా అనిపిస్తుంది. మీ ఇంటి పరిశుభ్రత మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుందట. నిపుణులు చెబుతున్నారు.
International kissing day 2023 : ముద్దులు .. ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక, శారీరక ఆరోగ్యాల రహస్యాలు
చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నాక చక్కగా వాటిని సర్దాలి అని తల్లిదండ్రులు చెబుతారు. వారు చెప్పే మాటల్లో ఎంతో అర్ధం ఉంది. ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడ ఉండి పరిశుభ్రంగా ఉంటే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది. పర్యావరణ పరిశుభ్రత మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుందట. మానసిక ఆరోగ్యం కోసం ఇంటిని శుభ్రంగా ఉంచుకోమని నిపుణులు సలహా ఇస్తున్నారు. పరిసరాలు చిందరవందరగా ఉంటే మనసు బాగోనట్లు అనిపిస్తుంది. అలా ఉంటే ఒత్తిడి, ఆందోళన, ఏకాగ్రత లేకపోవడం వంటి వాటికి దారి తీస్తుందని మాన్ హాటన్ థెరపీ కలెక్టివ్‌లో లైసెన్స్ పొందిన సైకాలజిస్ట్ పెగ్గి లూ చెప్పారు.
గజిబిజిగా ఉన్న ఇంట్లో మానసిక ఆరోగ్యం సరిగా ఉండకపోవచ్చునట. ఇంటిని చక్కగా సర్దుకోవడం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది. ఆందోళన, నిరాశలో ఉండేవారు ఇంటిని శుభ్రపరిచే పనులు చేస్తుంటే వారిలో అదనపు శక్తి చేకూరుతుందని డాక్టర్ లూ పేర్కొన్నారు. ముందుగా మీకు ఇష్టమైన ముఖ్యమైన గదిని ఎంచుకుని దానిని శుభ్రపరుచుకోవాలట. అందరికీ ముఖ్యమైనది వంటగదితో శుభ్రం చేసుకోవడం మొదలుపెడితే బెటర్. ఆ తరువాత బెడ్ రూం. ఇది ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లకు దోహదం చేస్తుంది. రోజువారి పనుల్లో కొన్ని వస్తువులు, లేదా బట్టలను చిందరవందగా కుప్పలుగా పోయకుండా చిన్న చిన్న మార్పుల ద్వారా పనులు తగ్గించుకుంటూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
Hydrotherapy : పిల్లల మానసిక అభివృద్ధిలో హైడ్రోథెరపీ ఎలా సహాయపడుతుందంటే ?
ఒక్కసారిగా అన్ని పనులు మీద వేసుకోకుండా డ్రాయర్, అల్మారా శుభ్రం చేసే పని తీసుకోండి. ఎందుకంటే ఒకేసారి అన్ని పనులు చేస్తే అలసట కలుగుతుంది. ఇంటిని శుభ్రపరచడం అంటే చాలామంది తప్పించుకోవాలనుకుంటారు. ప్రతిరోజు కొంచెంగా సర్దుకుంటూ ఉంటే ఒక్కసారిగా హైరానా పడకుండా ఉంటారు. ఇల్లు శుభ్రపరచడం అనేది మనలో ఏకాగ్రతను పెంపొందించడంతో పాటు క్లీన్‌గా కనిపించే ప్రదేశంలో మనసుకి ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంది.