Fermented rice : చద్దన్నం తింటే ఇన్ని ప్రయోజనాలా!.. అయితే అసలు వదలిపెట్టొద్దు…

ఎదిగే పిల్లలకు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తెల్లవారిన తరువాత చద్దన్నంగా అందిస్తే మంచి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది. శరీరంలోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోయి పిల్లలు ఉత్సహాంగా ఉ

Fermented rice : చద్దన్నం తింటే ఇన్ని ప్రయోజనాలా!.. అయితే అసలు వదలిపెట్టొద్దు…

Fermented Rice

Updated On : August 29, 2021 / 12:41 PM IST

Fermented rice : ఇంట్లో రాత్రి భోజనానికి వండిన అన్నాన్ని తినగా ఇంకా మిగిలిపోయి ఉంటుంది. ఆ మిగిలిని అన్నాన్ని తెల్లవారితే చద్దిదిగా మారుతుంది. దానినే చద్దనం అని పిలుస్తారు. అయితే పట్టణాల్లో నివాసముండే వారు ఫ్యాషన్లకు అలవాటు పడి చద్దాన్ని తినటమే మానేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల వారు నేటికి చద్దన్నాన్ని తినేందుకు ఇష్టపడుతూనే ఉన్నారు. చద్దన్నం తినటం అంత మంచిది కాదని, దానిని తినటం తమ వల్ల కాదంటూ అయిష్టత వ్యక్తం చేసేవారు లేకపోలేదు.

అసలు చద్దన్నం తినటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే అసలు వదిలిపెట్టరు. ఎందుకంటే అందులో ఉండే ఎన్నో పోషకాలు మనిషి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయట. ఈ విషయాన్ని ఇటీవల అమెరికన్ న్యూట్టరిషియన్ అసోసియన్ జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది. 100 గ్రాముల రాత్రి అన్నంలో 3.4 మిల్లి గ్రాముల ఐరన్ ఉంటే అదే తెల్లవారే సరికి చద్దన్నంగా మారితే 73.91మిల్లీ గ్రాములకు పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. బీ6, బీ 12 తదితర విటమిన్లు సైతం ఇదే తరహాలు రెట్టింపుగా మారిపోతాయని నిర్ధారించారు. అన్నం పులిస్తే అందులో ఐరన్, పొటాషియమ్, కాల్షియం, వంటి సూక్ష్మ పోషకాల స్ధాయి రెట్టింపవుతుందట.

ఎదిగే పిల్లలకు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తెల్లవారిన తరువాత చద్దన్నంగా అందిస్తే మంచి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది. శరీరంలోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోయి పిల్లలు ఉత్సహాంగా ఉంటారు. పీచుదనం కారణంగా మల బద్దకం, నీరసం లేకుండా ఉంటుంది. శరీరానికి అవసరమైన బ్యాక్టీరియా లభించటంతోపాటు, బిపీ , ఆందోళన తగ్గుతుంది. రాత్రి మిగిలిపోయిన అన్నంలో పాలుపోసి తోడువేసుకుని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది.

చద్దన్నాన్ని ఉదయాన్నే తినేయాలి. ఎక్కువ సమయం ఉంచకూడదు. అలా చేస్తే లేని పోని అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఉల్లిపాయలు, క్యారెట్, టమాటో వంటి ముక్కలు తరిగి తాలింపు వేసుకుని ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటారు. చద్దన్నాన్ని రాత్రంతా మజ్జిగలో నానబెటుకుని ఉదయాన్నే తింటే లావు ఉన్నవారు సన్నబడతారు. పాలుపోసుకుని తోడేసుకుని తింటే సన్నగా ఉన్నవారు లావు అవుతారు. ఆరోగ్యానికి ఇంతగా మేలు చేకూర్చే చద్ధనాన్ని మాత్రం వదిలిపెట్టకండి