Diabetics : మధుమేహ వ్యాధిగ్రస్తులు తినడానికి శెనగపిండి సురక్షితమేనా?
మధుమేహ వ్యాధిగ్రస్తులలో చిరుధాన్యాలు తినడం కొన్ని సందర్భాలలో హానికరంగా మారుతుంది. ముఖ్యంగా శనగపిండితో చేసిన చిరుతిళ్లైన పకోడీలు, శెనగపిండి బజ్జీలు, వంటివి తింటారు. వీటిని తీనటం వల్ల GI సూచిక వెంటనే పెరుగుతుంది. దీంతో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

gram flour safe for diabetics to eat
Diabetics : మధుమేహం వంటి వ్యాధులలో చక్కెర నియంత్రణ చాలా కీలకం. ఏ చిన్న పొరపాటు జరిగినా షుగర్ లెవెల్స్ పెరగుతాయి. ఈ పరిస్థితిలో పండ్లు , కూరగాయల వంటి వాటిలో ఏవి తినవచ్చు, ఏవి తినకూడదు అన్నదానిపైనే ఎక్కువగా చర్చిస్తారు. వాస్తవానికి మధుమేహం ఉన్నవారు శెనగ పిండి తో చేసిన ఆహార పదార్ధాలను తినటం పై నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO : Prevent Diabetes : మధుమేహం ఎలా నివారించాలి ? ప్రారంభ దశలో ఉంటే ఏంచేయాలి ?
శనగపిండిలో చక్కెర ఉందా ?
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే శెనగపిండిని, శనగపప్పును గ్రైండ్ చేయటం ద్వారా తయారు చేస్తారు. శనగపప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ 6ను కలిగి ఉంటుంది. దానితో తయారు చేసిన శెనగపిండి జిఐ 10. కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు శెనగపిండి తినడం ఏమాత్రం హానికరం కాదు.
డయాబెటిస్ ఉన్నవారికి శెనగపిండి ఎప్పుడు హానికరం ;
మధుమేహ వ్యాధిగ్రస్తులలో చిరుధాన్యాలు తినడం కొన్ని సందర్భాలలో హానికరంగా మారుతుంది. ముఖ్యంగా శనగపిండితో చేసిన చిరుతిళ్లైన పకోడీలు, శెనగపిండి బజ్జీలు, వంటివి తింటారు. వీటిని తీనటం వల్ల GI సూచిక వెంటనే పెరుగుతుంది. దీంతో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి శనగపిండితో తయారు చేసిన పదార్ధాలను తినటం మానుకోవటం మంచిది.
READ ALSO : Diabetes : వాయుకాలుష్యంతో మధుమేహం ముప్పు! పట్టణ వాసుల్లోనే అధికమా?
డయాబెటిస్ ఉన్నవారు శెనగ పప్పును ఎలా తీసుకోవాలి ;
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇంట్లోనే శెనగపిండిని తయారు చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండేలా చూసుకోవాలి. శనగపిండితో తయారు చేసిన స్నాక్స్ తినడానికి బదులుగా, శనగ పిండి తో చేసిన రోటీని తినవచ్చు. ఇది మధుమేహ రోగులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్ అయితే, శనగ పిండి పకోడాలకు బదులుగా, శెనగపిండి రోటీని తినాలి. దీని వల్ల షుగర్ పెరుగుదలను నియంత్రించడంతో ఇతర ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చు. తద్వారా చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.