Yoga Halasana : కొవ్వును కరిగించి, గుండెను బలంగా మార్చే హలాసనం!.
శరీర ఆకృతిని ఆకర్షణీయంగా ఉండేటట్లు చేయటంలో సహాయపడుతుంది. రోజూ హలాసనాన్ని వేయటం వలన బద్దకం నివారించుకోవచ్చు. సెక్స్ గ్రంధులను ఉత్తేజపరచటంలో హలాసనం ఎంతగానో సహాపడుతుంది.

Yoga Halasana
Yoga Halasana : శరీర ఆరోగ్యానికి, మానసిక ఒత్తిడులు తగ్గించుకోవటానికి యోగా ఎంతో ఉపయోగకరం. ఎన్నో ఏళ్ళకాలం నుండి యోగా పద్దతులను అనుసరించటం ద్వారా ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే యోగాలో ఒక్కో ఆసనానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రయోజనం ఉంటుంది. యోగాలో హలాసనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఆసన నాగిలి రూపంలో ఉంటుంది కనుక దానిని హలాసనం అని పేరు పెట్టారు. విపరీత కర్ణిక మరియు సర్వాంగాసనాలను వేయటంలో నిష్ణాతులైన వారు మాత్రమే ఈ ఆసనాన్ని వేయాలి.
హలాసనం వేసే పద్దతి ; ముందుగా శవాసనం వేయాలి. తరువాత కాళ్ళు రెండూ కలిపి మెల్లమెల్లగా తలవైపుగా నేలపై ఆనించాలి. చేతులు నేలమీద చాపి గాని, తలవైపు మడచిగాని ఉంచాలి. మీ వక్షస్థలం గడ్డానికి తగలాలి. మెల్లగా మీ చేతులను వెనక్కి చాచి పాదాల దగ్గరకు తీసుకువెళ్లండి. ఈ భంగిమలో మీ కాళ్లను నిటారుగా కొద్దిసేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత శ్వాసక్రియ మామూలుగా కొనసాగించాలి. ఈ భంగిమలో కనీసం రెండు నిమిషాలవరకూ ఉండేటట్లు చేయండి. ఆసనంలో ఉన్నంతసేపూ శ్వాసను బయటనే ఆపాలి. పొట్టను లోపలికి పీల్చి ఉంచితే ఈ ఆసనం సులువుగా వేయవచ్చును.
హలాసనం ఉపయోగాలు ; శరీర ఆకృతిని ఆకర్షణీయంగా ఉండేటట్లు చేయటంలో సహాయపడుతుంది. రోజూ హలాసనాన్ని వేయటం వలన బద్దకం నివారించుకోవచ్చు. సెక్స్ గ్రంధులను ఉత్తేజపరచటంలో హలాసనం ఎంతగానో సహాపడుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ముఖానికి, మెదడుకు రక్తప్రసరణ మరింత మెరుగుగా ఉంటుంది. వెన్నెముకకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు తొలగుతాయి. గుండె సంబంధిత కండరాలపై ఒత్తిడి పెరగటంవల్ల గుండె మరింత బలంగా మారుతుంది. గొంతు భాగం శుభ్రపడుతుంది. పిరుదలు, నడుము, తొడలు, ఉదరభాగంలో ఉన్న అధిక కొవ్వు ఖర్చయిపోతుంది. పిల్లలు ఎత్తు కూడా పెరిగే అవకాశం ఉంది. నడుము సన్నగా తయారవుతుంది. జీర్ణక్రియ మెరగుగా పనిచేస్తుంది.
గమనిక ; గర్భిణీతో ఉన్నవారు హలాసనాన్ని వేయరాదు. అధిక రక్తపోటు గలవారు, గుండెజబ్బులు, వరిబీజం, అల్సర్, స్పాండిలోసిన్ వున్నవారు హలాసనం వేయకూడదు. యోగాసనాలను వేసే సమయంలో శిక్షకుని సమక్షంలో వారి సూచనలు, సలహాలు పాటిస్తూ వేయటం మంచిది.