హ్యాపీ టెడ్డీ డే: మీరు ఇష్టపడేవారిని ఇలా ఇంప్రెస్ చెయ్యండి

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 05:50 AM IST
హ్యాపీ టెడ్డీ డే: మీరు ఇష్టపడేవారిని ఇలా ఇంప్రెస్ చెయ్యండి

Updated On : February 10, 2020 / 5:50 AM IST

ప్రేమికుల రోజు వచ్చేస్తుంది. మరో నాలుగు రోజుల్లో వాలెంటైన్స్ డే. వాలెంటైన్ వీక్‌ లో నాలుగో రోజు(ఫిబ్రవరి 10)ను టెడ్డీ డే‌ గా జరుపుకుంటారు. టెడ్డి బేర్స్ అంటే ఇష్టం లేనివారు ఉండరు.  ఇక అమ్మాయిలకి అయితే టెడ్డి బేర్ అంటే ఎంత ఇష్టమే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకి టెడ్డీస్ కి ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. వాటిని చూడగానే ఖచ్చితంగా వారి ముఖాల్లో ఓ ఆనందం కనిపిస్తుంది. 

g

ప్రేమను రెట్టింపు చేసే ప్రతీ వస్తువుకి వాలెంట్స్‌ వీక్‌ లో స్థానం ఉంది. అందులో టెడ్డీ కూడా ఒకటి. టెడ్డీ డే రోజున ప్రియురాలికి టెడ్డీని గిఫ్ట్ గా ఇచ్చి ప్రియుడు తన కళ్లలో ఎంతో ఆనందాన్ని చూస్తాడు. ఇంకో విషయమేంటంటే సాధారణంగా అమ్మాయిలంతా అన్ని విషయాలను టెడ్డీతో షేర్ చేసుకుంటారు. మరి ఇంత ఇష్టంగా చేసుకునే బొమ్మని మీరూ కూడా మీకు ఇష్టమైన వారికి ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. 

gh

వెంటనే మీకు నచ్చిన వారికి టెడ్డిని ఇచ్చి.. మీకు వారిపై ఎంత ఇష్టముందో వారికి తెలిసేలా చేయండి. ఇక లవ్ చేస్తూ… ఆ అమ్మాయికి ఇంకా చెప్పనివారికైతే ఇది సూపర్ ఛాన్స్.. వెంటనే పెద్ద టెడ్డి బేర్ ని కొని మీరు ఇష్టపడ్డ అమ్మాయికి గిఫ్ట్ గా ఇచ్చి ప్రపోజ్ చేయండి. 

gh