మే రెండో ఆదివారాన్నే మదర్స్‌డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకొంటామో తెలుసా?

  • Published By: Mahesh ,Published On : May 9, 2020 / 12:55 PM IST
మే రెండో ఆదివారాన్నే మదర్స్‌డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకొంటామో తెలుసా?

Updated On : May 9, 2020 / 12:55 PM IST

ప్రతియేటలాగే ఈసారి కూడా మే రెండో ఆదివారాన్ని లాక్‌డౌన్‌లోనే మదర్స్‌డేని జరుపుకోవడానికి ప్రపంచమంతా రెడీ. ఇంతకీ ఒక డేటు కాకుండా, రెండో ఆదివారం మాత్రమే మదర్స్‌డే ఎందుకు సెలబ్రేట్ చేసుకొంటారో మీకు తెలుసా? అసలు మదర్స్ డే ఎందుకు?ఎలా పుట్టింది?

గ్రీస్‌లో ప్రియా అనే దేవత ఉండేది. ఆమెను మదర్ ఆఫ్ గాడ్స్‌గా పిలిచేవారు. ఆ దేవతకు ప్రతి సంవత్సరం నివాళులు అర్పించేవారు.  17వ శతాబ్దంలో బ్రిటన్లోనూ మాతృమూర్తులను గౌరవిస్తూ… మదరింగ్ సండే పేరుతో ఉత్సవాన్ని నిర్వహించేవారు. ఆ తర్వాత 1822లో జూలియవర్డ్ హోవే అనే మహిళ మదర్స్‌డే‌ను నిర్వహించాలని అమెరికాలో ప్రతిపాదన చేసింది ప్రపంచం శాంతంగా ఉండాలటే మన కన్న తల్లి కోసం మదర్స్‌డే నిర్వహించాలన్నది ఆమె ఉద్దేశం. వెంటనేకాదుకాని 1914 నుంచి అధికారికంగా నిర్వహించడం మొదలుపెట్టారు. కారణం ఆనాటి అమెరికా అధ్యక్షుడు. ఆయనే మదర్స్‌డే‌ను అధికారికంగా నిర్వహించారు. అక్కడ నుంచి  ప్రపంచమంతా విస్తరించి… అమ్మకి వందనంలా కొనసాగుతోంది.

మదర్స్‌‌కు ఓరోజు కేటాయించడం అద్భుతమే. అందుకే అందరూ మదర్స్‌డేను  సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ప్రింట్ కార్డులను అమ్మారు. గిఫ్ట్‌లిచ్చారు. కథలురాశారు. సినిమాల్లో మథర్స్ డే గొప్పగా కనిపించింది. ఈసారి లాక్‌డౌన్ ఉన్నందున ఈసారి మదర్స్‌డేని సెలబ్రేట్ చేసుకోలేకపోవచ్చు. ఇంట్లోనే అమ్మతో ఉంటూ, అమ్మకు ఇష్టమైన పని చేసి అమ్మని సంతోషపడేలా చేయండి. ఇంతకన్నా అమ్మకు గొప్ప గిఫ్ట్ ఏముంటుంది?