HMPV Virus Symptoms : పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు.. లక్షణాలు ఏంటి? ఎవరెవరికి రిస్క్ ఎక్కువంటే?

HMPV Virus Symptoms : ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఎవరికి సోకుతుంది? ఎవరెవరి రిస్క్ ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

HMPV Virus Symptoms : పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు.. లక్షణాలు ఏంటి? ఎవరెవరికి రిస్క్ ఎక్కువంటే?

HMPV Virus Symptoms

Updated On : January 14, 2025 / 8:59 PM IST

HMPV Virus Symptoms : చైనాలో విజృంభించిన HMPV (హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్) వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో భారత్‌లో కూడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి.

Read Also : HMPV Virus : ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్.. బారినపడ్డ 14వేల మంది అమెరికన్లు.. సీడీసీ రిపోర్టులో సంచలన విషయాలు

హెచ్ఎంపీవీ వైరస్ సోమవారం నాటికి (జనవరి 13) , పుదుచ్చేరిలో ఒక కేసు నమోదైంది. దాంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 17కి చేరుకుంది. అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఎవరికి సోకుతుంది? ఎవరెవరి రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హెచ్ఎంపీవీ అనేది సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలను వ్యాప్తిచేస్తుంది. అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. బ్రోన్కైటిస్, న్యుమోనియా కేసులకు కూడా దారితీస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ప్రకారం.. హెచ్ఎంపీవీ సోకిన వ్యక్తులు సాధారణంగా దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారటం లేదా మూసుకుపోవడం, శరీర నొప్పులు, తలనొప్పి వంటి జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

హెచ్ఎంపీవీ ఎలా వ్యాపిస్తుంది? :
హెచ్ఎంపీవీ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వంటి శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. వైరస్‌తో కలుషితమైన ఉపరితలాన్ని తాకి, ఆపై మీ నోరు, ముక్కు లేదా కళ్లను తాకడం ద్వారా కూడా మీరు వ్యాధి బారిన పడవచ్చు.

హెచ్ఎంపీవీ లక్షణాలు ఏంటి? :

  • ముక్కు కారటం
  • దగ్గు
  • జ్వరం
  • గొంతు నొప్పి
  • గురక
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

హెచ్ఎంపీవీ బారిన పడే రిస్క్ ఎవరికంటే ? :
ఎవరైనా హెచ్ఎంపీవీ బారిన పడవచ్చు, శిశువులు, చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులు లేదా ఆస్తమా, గుండె జబ్బులు లేదా ఊపిరితిత్తుల వ్యాధి వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారని గమనించాలి. వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

Read Also : HMPV Virus: దేశంలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు