Parenting Tips : మీ పిల్లలు చెప్పిన మాట వినట్లేదా? కారణాలు తెలుసుకోండి

పిల్లలు ఒక్కోసారి చెప్పిన మాట వినకుండా మొండికేస్తారు. అలాంటి సమయంలో పేరెంట్స్ వారితో కఠినంగా వ్యవహరించడం పరిష్కారం కాదు. అసలు వారెందుకలా ప్రవర్తిస్తున్నారనే కారణాలని వెతకాలి.

Parenting Tips :  మీ పిల్లలు చెప్పిన మాట వినట్లేదా? కారణాలు తెలుసుకోండి

Parenting Tips

Updated On : December 3, 2023 / 3:51 PM IST

Parenting Tips : పిల్లలు ఒక్కోసారి పేరెంట్స్ చెప్పిన మాట వినరు. తినడం, చదువుకోవడం, ఆటలు ఇలా ఏ విషయంలో అయినా తమకు తోచినట్లు చేస్తామని మారాం చేస్తారు. మొండిగా ప్రవర్తించే పిల్లల పట్ల కొందరు పేరెంట్స్ కఠినంగా వ్యవహరిస్తారు. అలా చేయడం వల్ల పిల్లలు మాట వింటారా? అదే సరైన సొల్యూషనా? చదవండి.

Friendship : ఫ్రెండ్స్ అయినా సరే.. అంగీకరించకూడని అంశాలు తెలుసుకోండి

ఇటీవల కాలంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో పిల్లలపై మరింత శ్రద్ధ పెట్టే సమయం ఉండట్లేదు. అలాంటి సమయాల్లో తమకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని పిల్లలు మొండికేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి తల్లిదండ్రులు చెప్పిన మాట వింటే ఏదో ఒకటి కొనిస్తామని వాగ్దానాలు చేస్తుంటారు. కొందరు ఆ వాగ్దానాలను నెరవేర్చరు. దీంతో తల్లిదండ్రుల మీద పిల్లలకు నమ్మకం పోతుంది. భవిష్యత్తులో వారు కూడా ఇదేవిధంగా ప్రవర్తించడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.

Premature Baby Care Tips : నెలలు నిండకుండానే పిల్లలు పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ?

ఉద్యోగాల్లో బిజీ అయిపోయిన కొందరు తల్లిదండ్రులు పిల్లల భావోద్వేగాలను పట్టించుకోరు. దాంతో వారిలో ఆకలి, విసుగు, ఒంటరితనం వంటి భావాలు అంతర్లీనంగా ఎక్కువవుతాయి. దాంతో పేరెంట్స్ చెప్పిన మాటలు వినకుండా మొండికేసే స్వభావాన్ని పెంచుతాయి. పిల్లలు తమ పేరెంట్స్‌తో గడపాలని కోరుకుంటారు. తాము చెప్పే కబుర్లు వినాలని భావిస్తారు. వారిని దగ్గరకు రానీయకుండా.. వారు చెప్పేది వినకుండా నిరాకరించినపుడు కూడా పిల్లలు డిప్రెస్ అవుతారు. పెద్దవాళ్లు ఏం చెప్పినా వినడానికి అంగీకరించరు. కాబట్టి పేరెంట్స్ ఇలాంటి కొన్ని సున్నితమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని పిల్లలతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఏది చెప్పినా పిల్లలు వినకుండా మొండికేసే ప్రమాదం ఉంది.