Anxiety : ఇలా చేస్తే వెంటనే యాంగ్జయిటీ పారిపోతుంది!
ఆధునిక కాలంలో ఆందోళన మన జీవితంలో భాగమైంది. అత్యంత సాధారణ సమస్యల్లో ఇది కూడా ఒకటిగా మారింది. ఒక వ్యక్తి జీవితంలోని అన్ని అంశాలపైనా ఆందోళన ప్రభావాన్ని చూపిస్తుంటుంది. చేసే పని, సంబంధ బాంధవ్యాలు, వ్యక్తిగత జీవితం లేదా ఆరోగ్యం.. ఇలా అన్ని రకాలుగా ఆందోళన మనల్ని ప్రభావితం చేస్తుంది.

Anxiety
Anxiety : పని అనుకున్న సమయానికి అవ్వకపోయినా.. సమయానికి రావాల్సిన వాళ్లు రాకపోయినా.. ఇలా ఎన్నో ఆలోచనలు రోజువారీ జీవితంలో మనల్ని కలిచివేస్తుంటాయి. అంటే.. అనవసరంగా మనసు ఆందోళన చెందుతుందన్నమాట. ఇది చిన్నగా అనిపించినా భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యగా మారుతుందని మనం గుర్తించలేం.
READ ALSO : Allu Arjun : మామ కోసం వచ్చిన ఐకాన్ స్టార్.. నల్గొండలో అల్లు అర్జున్ హంగామా..
ఒక లిఫ్ట్ కోసం ముగ్గురు ఎదురుచూస్తుంటారు. అది త్వరగా రావాలని పదే పదే బటన్ నొక్కుతూ ఉంటారొకరు. మరొకరు.. వచ్చేవరకు ఎదురు చూసి వెళ్లొచ్చని లోలోపల దాని రాక కోసం మథనపడుతుంటారు. ఇక మూడో వ్యక్తి… అది వచ్చినా కూడా పట్టించుకోకుండా మెట్లు ఎక్కి త్వరగా గమ్యస్థానానికి వెళ్లిపోతుంటారు. ముగ్గురిలో ఆందోళన కామన్. కానీ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఆందోళన ఉంది. మనసు వివిధ కారణాల వల్ల రకరకాల సందర్భాల్లో భయాందోళనలకు గురవుతూ ఉంటుంది. ఇది సాధారణ జీవనశైలిలో భాగమయింది. అందుకే ఈ ఆందోళన తగ్గించేందుకు మనమే సరైన పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.
READ ALSO : Pranitha Subhash: అతిగా తినడం తగ్గడానికి చిట్కాలు చెప్తున్న హీరోయిన్ ప్రణీత సుభాష్
ఇప్పటి ఆధునిక కాలంలో ఆందోళన మన జీవితంలో భాగమైంది. అత్యంత సాధారణ సమస్యల్లో ఇది కూడా ఒకటిగా మారింది. ఒక వ్యక్తి జీవితంలోని అన్ని అంశాలపైనా ఆందోళన ప్రభావాన్ని చూపిస్తుంటుంది. చేసే పని, సంబంధ బాంధవ్యాలు, వ్యక్తిగత జీవితం లేదా ఆరోగ్యం.. ఇలా అన్ని రకాలుగా ఆందోళన మనల్ని ప్రభావితం చేస్తుంది. ఆందోళన ఎక్కువైతే మనిషి ఒంటరిగా ఫీలవుతాడు. సాధారణ సవాళ్లు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. క్షణంలో కోపం వచ్చేస్తుంటుంది. అందుకే స్వీయ నియంత్రణను నేర్చుకోవాలి.
బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ : నాడీ వ్యవస్థలో అలజడులు తగ్గించడం ద్వారా త్వరగా ఆందోళనను తగ్గించవచ్చు. ఇది శక్తివంతమైన టెక్నిక్. అందుకే డీప్ బ్రీతింగ్ అవసరం. దీనికోసం ముక్కు ద్వారా గాలి పీల్చుకొని నాలుగు లెక్కబెట్టండి. ఆ తర్వాత గాలిని ఒడిసి పట్టి ఏడంకెలులెక్కబెట్టాలి. ఇప్పుడు నోటి ద్వారా గాలిని వదులుతూ ఎనిమిది నంబర్లు లెక్కించి చూడండి. ఈ పద్ధతిని తరుచుగా చేస్తుంటే మీలోని ఆందోళన తగ్గుతుంది.
READ ALSO : Monsoon Gut Problems : కడుపుబ్బరం, మలబద్ధకంతోపాటుగా వర్షాకాలంలో కనిపించే 5 సాధారణ కడుపు దోషాలు !
గ్రౌండింగ్ టెక్నిక్స్ : ఇది చాలా సులువుగా చేసేయొచ్చు. కేవలం మన పంచేంద్రియాల సహాయంతో ఈ పద్ధతిని పాటించాలి. అదెలాగంటే..
చుట్టూ ఏవైనా ఐదు వస్తువులను చూసి వాటి పేర్లను రాయండి. లేదా ఐదు అంశాలకు కొత్త పేరు పెట్టండి.
ఏవైనా నాలుగు వస్తువులను తాకాలి.
మూడు విషయాలను విని వాటిని ఎవరికైనా చెప్పండి.
రెండు వాసన చూసి వాటిని నిశితంగా గమనించండి.
ఒక వంటను రుచి చూసి అదెలాగుందోనలుగురితో పంచుకోండి.
ఇలా వరుసగా పనులు చేయడం వల్ల మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటారు. ఆందోళన మీ దరిచేరదు.
READ ALSO : Kidney Stones : చక్కెర పదార్ధాలతో కిడ్నీలో రాళ్ల ముప్పు !
కండరాల సడలింపు; ఆందోళన చెందినప్పుడు.. ఒకసారి కాలి వేళ్ల నుంచి తల వరకు కండరాలను వీలైనంత మేర బిగించి కాసేపు ఉండండి. ఆ తర్వాత మెల్లగా సడలించండి. ఇలా కొన్ని సెకన్ల పాటు ప్రతి కండరాలను చేస్తుండాలి. ఈ పద్ధతి శారీరక, మానసిక ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది.
విజువలైజేషన్ : మనం ఏదైనా ఊహిస్తే మన కళ్ల ముందు సాక్షాత్కారం అవుతుంది. అంటే.. నిజంగా అని కాదు.. ఊహల్లోనే! అయితే ఆందోళనగా అనిపించినప్పుడు ఒకసారి కళ్లు మూసుకోండి. ఆ సమయంలో నిర్మలమైన వాతావరణంలో మీరు ఉన్నట్లు ఊహించుకోండి. అంటే.. కళ్లు మూసుకొని బీచ్, పార్క్ ఇలా ఏదో ఒక ప్రదేశంలో అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారనుకోండి. తక్షణమే మీలోని ఆందోళన మాయమవకపోతే చూడండి.
READ ALSO : Guava Plantations : పెరిగిన జామతోటల విస్తీర్ణం.. తగ్గిన లాభాలు
సంగీతం : ఈ సృష్టిలో సంగీతం మనపై చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుందనడంలో సందేహం లేదు. ప్రశాంతమైన, ఓదార్పు పాటలను మీ ప్లే లిస్ట్ జాబితాలో చేర్చండి. ఆందోళనగా అనిపించినప్పుడు వాటిని వినండి. ఆటోమెటిక్ గా మీ మూడ్ మారుతుంది. అలాగే మీ మనసును ఎప్పుడూ బిజీబిజీగా ఉంచితే సరిపోతుంది.
ఆందోళన లక్షణాలను తగ్గించడం అంత సులభం కాదు. కానీ మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని గుర్తు పెట్టుకోండి.