Abdominal Fat : పొట్టకరగాలంటే… ఇలా చేసి చూడండి

ఒత్తిడి తగ్గించుకొని, ఒత్తిడి కారణంగా కార్టిసాల్ అనే హార్మోన్ అధికంగా విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇది పొట్ట వద్ద కొవ్వు పెరిగేలా చేస్తుంది. వత్తిడి లేకుండా ప్రశాంతమైన

Abdominal Fat : పొట్టకరగాలంటే… ఇలా చేసి చూడండి

Abdominal

Updated On : August 23, 2021 / 12:17 PM IST

Abdominal Fat : కరోనాతో కొంత మంది జీవితాలు ఇళ్ళకే పరిమితమయ్యాయి. గత రెండేళ్ళ కాలంగా సరైన శారీరక శ్రమలేక, అటు ఇటు కదలకుండా ఇంటికే పరిమితం కావటంతో శరీరాలు బరువెక్కాయి. అందులోనూ చాలా మందికి తమ పొట్ట సైజులు విపరీతంగా పెరిగిపోయాయి. పొట్టచుట్టూ చేరిన కొవ్వులను కరిగించుకునేందుకు చాలా మంది ఏంచేయాలన్న ఆలోచనలో పడ్డారు. అలాంటి వారు ఓ ప్రణాళికా బద్ధంగా పొట్టకొవ్వులను కరిగించుకోవాలి. అందుకోసం కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది.

పొట్ట దగ్గర కొవ్వు కరిగించాలంటే వారంలో మూడు రోజుల పాటు పూర్తి బాడీ వ్యాయామాలు చేయటం ఉత్తమం. పుషప్స్, పులప్స్, రోప్ జంపింగ్ వంటివి వాటిని చేయాలి. ఒక్కో వర్కవుట్ లో 500 నుండి 600 క్యాలరీలు ఖర్చు అయ్యేలా చూసుకోవాలి.

పొట్ట చుట్టూ ఉండే కొవ్వు త్వరగా కరిగించుకునేందుకు అందుకు తగ్గట్టు వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వ్యాయామంతోపాటుగా తక్కువగా కొవ్వులు ఉండే ఆహారం తీసుకోవటం మంచిది. పంచదార అధికంగా ఉండే స్వీట్లు వంటి వాటిని తినకపోవటం మేలు. తక్కువ కొవ్వులు కలిగిఉండే డైరీ పదార్ధాలను తీసుకోవాలి.

ఒత్తిడి తగ్గించుకొని, ఒత్తిడి కారణంగా కార్టిసాల్ అనే హార్మోన్ అధికంగా విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇది పొట్ట వద్ద కొవ్వు పెరిగేలా చేస్తుంది. వత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవనాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి. ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఉప్పుకు బదులుగా వీలుంటే మిరియాల పొడి వంటి స్పైసెస్ ను వినియోగించవచ్చు. శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళేలా చేసేందుకు తగినంత నీరు తాగాలి.

గ్రీన్ టీ, జ్యూస్ లు తాగటం వల్ల పొట్ట తగ్గటంతోపాటు, చర్మం నిగారింపుగా ఉంటుంది. అల్లం కూడా పొట్ట తగ్గటంలో సహాయపడుతుంది. అల్లంను తురిమి గ్రీన్ టీలో వేసుకొని త్రాగవచ్చు. అంతేకాక అల్లం గ్యాస్ తగ్గించటానికి కూడా సహాయపడుతుంది. పొటాషియం సమృద్ధిగా లభించే అరటి,బొప్పాయి,పెరుగు వంటి వాటిని ఆహారంలో తీసుకుంటే పొట్టను తగ్గించటంలో సహాయపడటమే కాకుండా కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.