Dry Hair : పొడిబారిన జుట్టు తళతళ మెరవాలంటే!.

కొబ్బరి పాలలో శనగ పిండి కలిపి తలపై బాగా పట్టించాలి. పావు గంటపాటు అలాగే వదిలేయాలి. అనంతరం తల స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు తళతళ మెరిసిపోతుంది. కుదుళ్ళు బలంగా మారాతాయి.

Dry Hair : పొడిబారిన జుట్టు తళతళ మెరవాలంటే!.

Hair

Updated On : March 25, 2022 / 11:30 AM IST

Dry Hair : కాలానుగుణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. సమస్యల నుండి విముక్తి పొందాలంటే జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం మంచిది. జుట్టు పొడిబారిపోయిన వారు కొన్ని రకాల చిట్కాలను అనుసరించటం ద్వారా తళతళ మెరిసే జుట్టును తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. చాలా మంది జుట్టును ప్రకాశ వంతంగా చేసుకునేందుకు వివిధ రకాల హెయిర్ మాస్క్ లు, ప్యాక్ లు వాడుతుంటారు. అయితే ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అలాంటి వారికి కొన్ని రకల చిట్కాలు చక్కని ఫలితాన్ని ఇస్తాయి.

1.శిరోజాలు పట్టుకుచ్చులా నిగనిగలాడాలంటే కుంకుడు కాయలను ముందుగా గంట సమయం నానబెట్టుకోవాలి. అందులో కాస్త ఉసిరి పొడి కలుపుకుని తలస్నానం చేయాలి. ఇలా చేస్తే పట్టులాంటి జుట్టు సొంతం చేసుకోవచ్చు.

2.బొప్పాయి ముక్కలను గుజ్జుగా చేసి అందులో పెరుగు కలిపి తలకు రాసుకుని అరంగంట సమయం ఆర నివ్వాలి. తరువాత తలస్నానం చేయాలి ఇలా చేయటం వల్ల జట్టు మృధువుగా మారుతుంది.

3. కోడిగుడ్డు సొనలో కాస్త ఆలివ్ అయిల్ కలిపి తలకు రాసుకోవాలి. అలా పావుగంట సేపు వదిలేయాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు నిగారింపు సంతరించుకుంటుంది.

4. పావు కప్పు నిమ్మరసంలో మినుముల పొడి , పెరుగు కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. అరగంటపాటు అలాగే వదిలేయాలి. అనంతరం తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయటం వల్ల జట్టు మెరుపును సంతరించుకుంటుంది.

5. కొబ్బరి పాలలో శనగ పిండి కలిపి తలపై బాగా పట్టించాలి. పావు గంటపాటు అలాగే వదిలేయాలి. అనంతరం తల స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు తళతళ మెరిసిపోతుంది. కుదుళ్ళు బలంగా మారాతాయి.

6. కొన్ని మెంతులు, గోరింటాకు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆనీటిలో చల్లారక కొంచెం నిమ్మరసం కలుపు కోవాలి. ఈ విశ్రమంతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

వీటితో పాటు తీసుకునే ఆహారంలో ఎ, బి, సి, డి, ఇ వంటి విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. జట్టు ఆరోగ్యంగా ఉండటానికి తీసుకునే ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోవాలి.