Tea : టీ తాగటం వల్ల ఆరోగ్యానికి లాభంతోపాటు… సమస్యలు

రోజుకి రెండు కప్పుల టీ తాగడం వల్ల చిగుళ్లలో క్యావిటీస్ ని అరికడుతుంది. పుదీనా, గ్రీన్ టీ తాగడం వల్ల అలర్జీల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది.

Tea :  టీ తాగటం వల్ల ఆరోగ్యానికి లాభంతోపాటు… సమస్యలు

Tea (1)

Updated On : January 13, 2022 / 3:13 PM IST

Tea : పనివత్తిడితో అలసిపోయి ప్రశాంతత కోసం చాలా మంది టీ తాగటాన్ని అలవాటుగా చేసుకుంటారు. దీనిని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంతా చెప్తుంటారు. సామాన్యుడి నుండి పెద్ద స్ధాయి వరకు అందరూ టీని సేవిస్తుంటారు. శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు అందుతాయి. దీంతో ఎముకలు కూడా దృఢంగా మారాతాయట. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కొంతమంది అదే పనిగా టీలు తాగుతుంటారు. అయితే టీని మితంగానే తాగాలి ఎక్కవ సార్లు టీ తాగటం వల్ల కొన్ని అనార్ధాలు కూడా ఉన్నాయి. రోజుకు 2 నుండి 3 సార్లు టీ తాగవచ్చు. అంతకు మించి తాగితే మాత్రం ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.

టీ తాగటం వల్ల కలిగే లాభాలు : టీ అజీర్తి సమస్యను నివారించటం బాగా ఉపకరిస్తుంది. వికారంగా ఉన్నప్పుడు వేడివేడిగా ఓ కప్పు టీ తాగితే ఫలితం ఉంటుంది. నెలసరి సమయంలో కడుపు, నడుము నొప్పితో బాధపడే మహిళలు ఓ కప్పు యాలుగులతో కలిపి తయారు చేసుకున్న టీ తాగితే ఉపశమనం కలిగిస్తుంది. టీ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. అలసట, ఒత్తిడి మటుమాయమవుతుంది. హెర్బల్ టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు.

రోజుకి రెండు కప్పుల టీ తాగడం వల్ల చిగుళ్లలో క్యావిటీస్ ని అరికడుతుంది. పుదీనా, గ్రీన్ టీ తాగడం వల్ల అలర్జీల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. గుండె వ్యాధులు, క్యాన్సర్, బరువు తగ్గడం, నిరోధిస్తుంది. టీ తాగడం వల్ల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడుతుంది. టీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పటిష్టం చేసి బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడుతుంది. జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

అతిగా టీ తాగటం వల్ల వచ్చే సమస్యలు ; కిడ్నీలో రాళ్ల సమస్యకు టీ ఒక కారణం అని పలు పరిశోధనల్లో తేలింది. రోజుకు ఐదు కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే ప్రొస్టేట్ క్యాన్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. మోతాదుకు మించి తాగితే.. ఎముకల పటుత్వంలో సమస్యలు వస్తాయి. ఎముక తొందరగా అరిగిపోతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. శరీరంలోని ఐరన్ పై ప్రభావం చూపిస్తుంది. టీ తాగడం వల్ల ఎసిడిటీ పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. పన్నెండు ఏండ్లలోపు పిల్లలకు అ్సలు టీ తాగించకూడదు. ఇందులోని కెఫిన్ పిల్లల శరీరంలో నిల్వ ఉండే పోషకాలను నాశనం చేస్తుంది. రక్తపోటు ఉన్నవారు టీకి దూరంగా ఉండాలి.