Grape Juice : నిద్రలేమి సమస్యలు… ద్రాక్ష జ్యూస్ తో చెక్!..
నిద్రపోవటానికి సరిగ్గా అరగంట ముందుగా ద్రాక్ష జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఎంతో హాయిగా నిద్ర పోవచ్చని తాజా అధ్యయనాలు తేల్చాయి

Grapes Juice
Grape Juice : జీవన విధానంలో వచ్చిన మార్పులు, పని వత్తిడులు, ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రపోవాలని ప్రయత్నించినా రాత్రి సమయానికి నిద్ర రాని పరిస్ధితి. ఈ క్రమంలోనే కొందరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ విధంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ద్రాక్ష చక్కని పరిష్కార మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్క నిద్రలేమి సమస్యనే కాదు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని నిర్మూలించడంలో ద్రాక్ష్ పండు ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
100 గ్రాముల ద్రాక్ష నుంచి 69 క్యాలరీల శక్తి అందితే కొలెస్ట్రాల్ జీరో శాతం ఉంటుందన్నారు. పైపెచ్చు. విటమిన్ సి, విటమిన్ ఎ, కెరోటిన్, రాగి, మెగ్నీషియం, బీకాంప్లెక్స్ విటమిన్లతో పాటు ప్రధాన ఎలక్ట్రోలైట్ అయిన పొటాషియం అధికంగా ఉంటుంది. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు, మరియు వైన్ తయారుచేయవచ్చును. ద్రాక్ష వల్ల ఎసిడిటిని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు , బరువు తగ్గించుకోవాలనుకొనే వారు ద్రాక్షా జ్యూస్ ను తాగితే మంచి ఫలితం ఉంటుంది.
తాజా పరిశోధనల ప్రకారం.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ద్రాక్షలను జ్యూస్ రూపంలో లేదా నేరుగా పండ్ల రూపంలో తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చుని తెలియజేస్తున్నారు. నిద్రకు సహకరించే మెలటోనిన్ అనే హార్మోన్ ద్రాక్షలలో పుష్కలంగా ఉంటుంది. నిద్రపోవటానికి సరిగ్గా అరగంట ముందుగా ద్రాక్ష జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఎంతో హాయిగా నిద్ర పోవచ్చని తాజా అధ్యయనాలు తేల్చాయి.