Gongura : చలికాలంలో గోంగూర తినటం మంచిదేనా?
చలి కాలంలో జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ అవుతుంటాయి. ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ జ్వరాలు వంటి సమస్యలు ఎదరవుతుంటాయి.

Gongura
Gongura : తెలుగువారిలో వంటకాలలో గోంగూర కు ఉన్న ప్రాధాన్యత మరే ఇతర వంటకానికి ఉండదు. గోంగూరతో మంచి రుచికరమైన కర్రీస్, పచ్చళ్లు చేసుకుని లొట్టలేసుకుని తినేస్తుంటారు. ఆయుర్వేదంలో గోంగూరలో అనేక ఔషదగుణాలు ఉన్నట్లు చెబుతుంది.. గోంగూరను రోజూ తింటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
గోంకూరలో క్యాల్షియం కూడా బాగా ఉంటుంది. ఎముకలు బలంగా మారేందుకు గోంగూర బాగా ఉపయోగపడుతుంది. గోంగూరలో అనేక విటమిన్స్ ఉన్నాయి. దీంతో కంటి సంబంధిత వ్యాధులు దూరమౌతాయి. రేచీకటితో ఇబ్బందిపడేవారికి గోంగూర బాగా పనిచేస్తుంది. గోంగూరలో విటమిన్ ఏ, బి 1, బి 2, బి 9 తోపాటు విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. పొటాషియం, ఐరన్ లాంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చక్కర స్థాయిని తగ్గించి షుగర్ రాకుండా చేస్తాయి. అంతేకాదు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
అయితే చలి కాలంలో జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ అవుతుంటాయి. ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ జ్వరాలు వంటి సమస్యలు ఎదరవుతుంటాయి. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. శరీరానికి బాగా వేడినిచ్చే ఆహార పదార్ధాలను తీసుకోవటం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అలాంటి వాటిలో గోంగూర ఒకటి గోంగూరతో వివిధ రకాల ఆహారాలను తయారు చేసుకుని తినటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. గోంగూర పప్పు, గోంగూర చట్నీ, గోంగూర చికెన్, ఇలా రుచికరమైన వంటకాలను చేసుకుని తినవచ్చు. పండు మిరప పండ్లను గోంగూరతో పాటు తగినంత ఉప్పువేసి తొక్కి నిలవ పచ్చడి చేసుకుని అవసరమైనప్పుడు తింటుంటారు. చలికాలంలో గోంగూర తినటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
ఇందులో ఉండే కాల్షియం , ఐరన్ ఎముకలను, కండరాలను బలేపేతం చేసేందుకు దోహదపడతాయి. దగ్గు, ఆయాసం వంటి సమస్యలనున్న వారికి గోంగూర బాగా ఉపకరిస్తుంది. ఆ సమస్యల నుండి వారికి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగేందుకు ఉపయోగపడుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. గోంగూర చికెన్ కర్రీ తింటే పురుషుల్లో సంతానోత్పత్తి పెరుగుతుంది. గోంగూరను ఆహారంలో బాగం చేసుకోవటం వల్ల శరీరంలో వేడి పుట్టి చలిని తట్టుకునేందుకు సహాయపడుతుంది.