walking : గుండెపోటుకు గురైన వారికి నడక మంచిదేనా!..
గుండెపోటు వచ్చిన వారు రోజుకు 30 నిమిషాల పాటు నడవటం ఆరోగ్యానికి శ్రేయస్కరమని సూచిస్తున్నారు.

Walk
walking : గుండెపోటుకు గురైన వ్యక్తుల పరిపూర్ణ ఆరోగ్యానికి పరిపూర్ణ జీవనశైలి కోసం జరిపిన అధ్యయనాల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గుండెపోటుకు గురైన వ్యక్తలు వారం మొత్తంలో మూడు నుండి నాలుగు గంటల పాటు నడవగలిగితే డెత్ రిస్క్ లు 54శాతం తగ్గుతాయని అధ్యయనంలో తేలింది. మెడికల్ జర్నల్ న్యూరాలజీ అనే అన్ లైన్ పత్రికలో ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి.
సైకిల్ తొక్కటం లేకుంటే , తేలకపాటి వ్యాయామాలు చేయటం వల్ల డెత్ రిస్కుల నుండి వారు సులభంగా బయటపడవచ్చని తేల్చారు. ఈ తరహా శారీర వ్యాయామాలు యువకులకు మరింత మేలు చేస్తాయని తేల్చారు. 75ఏళ్ళ కంటే తక్కువ వయస్సు కలిగిన వారు తేలకపాటి ఓ మోస్తరు వ్యాయామాల వల్ల మరణించే రిస్క్ 80శాతం వరకు తగ్గుతుంది. గుండెపోటు వచ్చిన వారు రోజుకు 30 నిమిషాల పాటు నడవటం ఆరోగ్యానికి శ్రేయస్కరమని సూచిస్తున్నారు.
చాలా మంది గుండెపోటు వచ్చి చికిత్స చేయించుకున్న వారికి నడక ఎంతగానో ఉపయోగపడుతుందని ఇప్పటికే ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉండటమే కాదు మానసిక స్ధితి మెరుగువతుందట. తక్కవ రక్తపోటు, రక్త ప్రసరణ మెరుగై గుండెజబ్బుల ముప్పును తగించుకోవచ్చు.