Jaggery Tea : బరువు తగ్గటంతోపాటు, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుండి ఉపశమనం కోసం బెల్లం టీ !
బెల్లం టీ పీరియడ్స్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బెల్లం టీ తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిర్లు, కడుపునొప్పి మొదలైన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

jaggery tea
Jaggery Tea : ప్రస్తుత చలికాలంలో చల్లని గాలులు మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. దీని వల్ల తరచుగా అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. ఈ సీజన్‌లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. చలికాలపు సీజన్‌లో ఫిట్‌గా ఉండేందుకు ఆహారంలో అనేక మార్పులు చేసుకోవటం చేస్తుంటారు. అలాంటి వాటిలో బెల్లం టీ కూడా ఒకటి.
READ ALSO : Alternatives to Sugar : బ్రౌన్ షుగర్, బెల్లం, తేనె వంటివి చక్కెరకు మంచి ప్రత్యామ్నాయాలేనా ?
వాస్తవానికి మన పెద్ద కాలం నుండి చలికాలంలో బెల్లంతో చేసిన వాటిని తినమని సలహా ఇస్తారు. ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ ఉదయాన్నే బెల్లం టీ తాగడం వల్ల అనేక రోగాలను దూరం చేసుకోవచ్చు. బెల్లం టీ వల్ల ఆరోగ్యపరమైన ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
చలికాలంలో బెల్లం టీమ్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ;
1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ;
బెల్లం టీ జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ప్రతిరోజూ ఉదయం బెల్లం టీ తాగటం మంచిది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
READ ALSO : Jaggery and Lemon Water : నిమ్మరసంలో బెల్లం కలిపి తీసుకుంటే బరువు త్వరగా తగ్గొచ్చు తెలుసా?
2. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది ;
బెల్లం అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. ఇందులో క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బి, ఐరన్, అనేక పోషకాలు లభిస్తాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చలికాలంలో రోజూ ఉదయం క్రమం తప్పకుండా బెల్లం టీ తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
3. బరువు తగ్గడంలో ;
చలికాలంలో బరువు తగ్గడం అంత సులభం కాదు. ఈ సమయంలో ఆహారంలో తక్కువ కేలరీల ఆహారాలను చేర్చాలి. ప్రతిరోజూ ఉదయం బెల్లం టీ తాగటంవల్ల జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
READ ALSO : Jaggery : ఆరోగ్యానికి మేలు చేసే బెల్లం! బెల్లం గురించి ఆయుర్వేదం ఏంచెబుతుందంటే?
4. పీరియడ్స్ పెయిన్ నుండి ఉపశమనం కోసం ;
బెల్లం టీ పీరియడ్స్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బెల్లం టీ తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిర్లు, కడుపునొప్పి మొదలైన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
5. శరీరం నుండి వ్యర్ధాలను బయటకు పంపుతుంది ;
బెల్లం శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. రోజూ బెల్లం టీ తాగితే ఊపిరితిత్తులు, ప్రేగులు, పొట్టను సులభంగా శుభ్రపడుతుంది. బెల్లం టీ తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు.