Kiwi Fruit : గుండెకు మేలు చేసే కివి పండు

కివి పండుని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అందులోని రోగ నిరోధక గుణాలు మన శరీరానికి అంతే మేలు చేస్తాయి.

Kiwi Fruit : గుండెకు మేలు చేసే కివి పండు

Kiwi Fruit

Updated On : February 15, 2022 / 2:39 PM IST

Kiwi Fruit : కివి పండుని చైనీస్ గూస్ బెర్రీ అని పిలుస్తారు. తొలుత ఈ పండ్లసాగు చైనాలో చేపట్టారు. ఆతరువాత చైనా నుండి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం వాటిని కివీ పేరుతో పిలుస్తున్నారు. కివి పండు తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుంది. విటమిన్ A, క్యాల్షియం, విటమిన్ సి , ఐరన్ , విటమిన్ B6 , మెగ్నిషియం వంటి పోషకాలు కివి పండులో లభిస్తాయి. శరీరంలో విటమిన్లు, మినరల్స్ కొరత ఉంటే అలాంటి వారు కివి పండుని తమ ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల మంచి ఫలితం పొందుతారు. అందుకే శరీరానికి కావాల్సింత ఎక్కువ పోషకాలను అందించే పండ్లలో కివి కూడా ఒకటిగా చెప్తుంటారు.

ఫ్యాటీ లివర్ సమస్యకు చికిత్సగా కివి పండుని ఉపయోగపడుతుంది. కివి పండు తీసుకోవటం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటి లివర్‌కి చికిత్సగా కూడా దీనిని పరిగణిస్తారు. గుండె సంబంధిత రుగ్మతలు రాకుండా ఉంటాయి. కివి పండులో ఉండే పొటాషియం కారణంగా గుండె సమస్యలు దరిచేరవు. మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే.. అది అంతే బలంగా మన శారీరక రుగ్మతలతో పోరాడుతుంది.

కివి పండుని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అందులోని రోగ నిరోధక గుణాలు మన శరీరానికి అంతే మేలు చేస్తాయి. కివి పండులో ఉండే అతి తక్కువ శాతం గ్లైకేమియా ఇండెక్స్ వల్ల రక్తంలో చక్కర శాతం అదుపులో ఉంటుంది. తద్వారా మధుమేహన్ని అదుపులో ఉంచవచ్చు. ఎముకలు గుల్లబారటం వంటి సమస్యలు కివి తినటం వల్ల దూరమౌతాయి.

నిద్రకు ఉపక్రమించే సమయానికి రెండు గంటల ముందు కివి పండు తింటే నిద్రలేమి సమస్యలు తొలగిపోయి ప్రశాంతంగా నిద్రపడుతుంది. చర్మ రుగ్మతలు,క్యాన్సర్ వంటివి రాకుండా ఈ కివి పండు కాపాడుతుంది. కివి పండును రోజు తినడం వల్ల మన కళ్ళకు హాని కలిగించే పలు కెమికల్ రియాక్షన్స్ తగ్గుముఖం పడతాయి.

కివి పండులో లభించే రకరకాల విటమిన్లు, మినరల్స్ చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే ముడతలు కూడా తగ్గుముఖం పడతాయి. కివి పండు గుజ్జుని కళ్ళ చుట్టూ రాసుకోవడం వల్ల కళ్ల క్రింద ఏర్పడే  నల్లటి వలయాలు తొలిగించుకోవచ్చు. కివి పండు గుజ్జును తలకు పట్టించటం వల్ల జుట్టు రాలటం, జట్టు తెల్లబడటం వంటి సమస్యలు తగ్గుతాయి.