Car cleaner became Tiktok dancer : లాక్ డౌన్‌లో ఉపాధి లేక.. టిక్ టాక్ డ్యాన్సర్ అవతారమెత్తిన కారు క్లీనర్

దేశంలో లాక్‌డౌన్ విధించడానికి ముందు 29ఏళ్ల టిక్ టాక్ సెన్సేషన్ అర్మన్ రాథోడ్ ప్రతిరోజు ఉదయాన్నే 20 కార్లకు పైగా వాషింగ్ చేసేవాడు. తన చిన్నప్పటి నుంచి ఇదే పనిచేస్తు పొట్టపోసుకుంటున్నాడు.

Car cleaner became Tiktok dancer : లాక్ డౌన్‌లో ఉపాధి లేక.. టిక్ టాక్ డ్యాన్సర్ అవతారమెత్తిన కారు క్లీనర్

Updated On : March 17, 2021 / 5:47 PM IST

car cleaner became tiktok dance sensation : దేశంలో లాక్‌డౌన్ విధించడానికి ముందు 29ఏళ్ల టిక్ టాక్ సెన్సేషన్ అర్మన్ రాథోడ్ ప్రతిరోజు ఉదయాన్నే 20 కార్లకు పైగా వాషింగ్ చేసేవాడు. తన చిన్నప్పటి నుంచి ఇదే పనిచేస్తు పొట్టపోసుకుంటున్నాడు. సాయంత్రం కాగానే తన చిన్ననాటి స్నేహితులతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు. పగిలిన స్ర్కీన్ ఒప్పో ఫోన్లలో స్నేహితులతో కలిసి గంటల తరబడి కొరియోగ్రాఫింగ్ డ్యాన్స్ చేస్తుండేవాడు. ఏడాది క్రితం తన స్నేహితుడి పెళ్లి వేడుకలో డ్యాన్స్ ప్రదర్శన చేశాడు. అతడి స్నేహితుడు రాథోడ్‌కు ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అప్పటినుంచి తన ఫోన్లో డ్యాన్స్ రికార్డింగ్ చేస్తూ తప్పులను సరిదిద్దుకునేవాడు. అలా వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు. తన డ్యాన్స్ తానే రికార్డు చేసుకోవడం ద్వారా తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని అర్మన్ చెబుతున్నాడు. అలా 15ఏళ్లుగా డ్యాన్స్ కెరీర్ కొనసాగిస్తున్నాడు. అర్మన్ పుట్టింది గుజరాత్ లోని వల్సద్ గ్రామంలో.

ఇప్పటివరకూ 100 మంది స్థానిక డ్యాన్సర్లతో పోటీపడ్డాడు. 50 అవార్డులు గెల్చుకున్నాడు. 2007లో తన 16వ ఏటా తొలిసారి డ్యాన్స్ పోటీలో పాల్గొన్నాడు. 2009లో రెండేళ్ల తర్వాత మాత్రమే అతడు రూ.3వేలు ప్రైజ్ మనీ సంపాదించాడు. అప్పటినుంచి పెళ్లిళ్లు, పలు ఈవెంట్లలో డ్యాన్స్ ప్రదర్శన చేస్తూ పొట్టు పోసుకునేవాడు. ఓ రోజు సాయంత్రం డ్యాన్స్ ప్రాక్టీస్ సమయంలో అర్మన్ స్నేహితులు టిక్ టాక్ డ్యాన్స్ వీడియోలు చూపించారు. తన డ్యాన్స్ వీడియోలను టిక్ టాక్ లో అప్ లోడ్ చేయమన్నారు.

ముందుగా ఫన్నీ వీడియోలతో మొదలుపెట్టిన అర్మన్.. డ్యాన్స్ వీడియోలను పోస్టు చేశాడు. అలా టిక్ టాక్ డ్యాన్స్ సెన్సేషన్‌గా అవతరించాడు. అర్మన్ రాథోడ్ టిక్ టాక్ అకౌంట్లో 2.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో తన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల మే 15న ఆర్మన్ హృతిక్ రోషన్ ‘You are my Soniya’ పాటకు డ్యాన్స్ రికార్డు చేసి టిక్ టాక్ లో అప్ లోడ్ చేశాడు. దీనికి 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఫాలోవర్లు ఒక్కసారిగా పెరిగిపోయారు. చాలామంది టిక్ టాక్ యూజర్లు ఆర్మన్ కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత తమతో కలిసి డ్యాన్స్ చేయాలని మెసేజ్ లు పెడుతున్నారని ఆర్మన్ చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాను సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెల్చుకున్న టిక్ టాక్ సెన్సేషన్ అర్మన్ రాథోడ్ వాస్తవానికి ఓ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. తనకు సరైన ఇల్లు లేదు. ఓ చిన్న రేకుల షెడ్ లో నివసిస్తున్నాడు. తన తల్లిదండ్రులతో కలిసి ఇదే ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒకవైపు కారు క్లీనర్ గా పనిచేస్తూనే తనలోని డ్యాన్స్ టాలెంట్‌ను సోషల్ మీడియా వేదికగా నిరూపించుకున్నాడు.

Read:  జర భద్రం: బహిరంగ ప్రదేశాల్లో ఈ పనులు చేస్తే శిక్ష తప్పదు