అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో : మధ్యాహ్నా భోజనంలో పాలు
రాష్ట్రంలో స్కూల్ పిల్లలకు బలమైన పోషక ఆహారం అందించే దిశగా తమిళనాడు అడుగులు వేస్తోంది. చెన్నైలోని అన్ని ప్రైమరీ స్కూళ్లలో త్వరలో మధ్యాహ్నా భోజనంలో పాలు చేర్చనున్నారు.

రాష్ట్రంలో స్కూల్ పిల్లలకు బలమైన పోషక ఆహారం అందించే దిశగా తమిళనాడు అడుగులు వేస్తోంది. చెన్నైలోని అన్ని ప్రైమరీ స్కూళ్లలో త్వరలో మధ్యాహ్నా భోజనంలో పాలు చేర్చనున్నారు.
రాష్ట్రంలో స్కూల్ పిల్లలకు బలమైన పోషక ఆహారం అందించే దిశగా తమిళనాడు అడుగులు వేస్తోంది. చెన్నైలోని అన్ని ప్రైమరీ స్కూళ్లలో త్వరలో మధ్యాహ్నా భోజనంలో పాలు చేర్చనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫస్ట్ క్లాసు విద్యార్థుల నుంచి ఐదో తరగతి విద్యార్థుల వరకు మధ్యాహ్నా భోజనం పథకంలో భాగంగా పాలు కూడా ఇవ్వనున్నట్టు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పాలు సరఫరా అమలుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పాల సరఫరాకు అయ్యే బడ్జెట్ ప్రక్రియపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. పాలను సేకరించే ప్రాంతాలు స్కూళ్లకు సాధ్యమైన దగ్గరగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
పాలను ఎక్కువ సమయం నిల్వ చేస్తే చెడిపోయే అవకాశం ఉందని, పాల పౌడర్ అయితే బాగుంటుందని యోచిస్తున్నట్టు సీనియర్ అధికారి తెలిపారు. మధ్యాహ్నా భోజన పథకంలో పాలను తప్పనిసరిగా చేర్చాల్సిందిగా 2018లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆర్థిక భారం దృష్ట్యా కొన్ని రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాలు మాత్రమే కొన్ని జిల్లాలోన్ని తమ విద్యార్థులకు పాలను సరఫరా చేశాయి. ఫస్ట్ క్లాసు నుంచి ఐదో తరగతి విద్యార్థులకు మాత్రమే కాకుండా ముందు క్లాసు విద్యార్థులకు కూడా అందించినట్టు అధికారి ఒకరు తెలిపారు. రానున్న రోజుల్లో హైయర్ క్లాస్ విద్యార్థులకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలిపారు.
13 ఐటమ్స్.. ఇప్పుడు పాలు కూడా :
తమిళనాడు స్కూళ్లల్లో ప్రస్తుతం.. మధ్యాహ్నా భోజనంలో మొత్తం 13 పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నారు. అందులో కూరగాయాలు, గుడ్లు వారానికి ఐదు సార్లు అందిస్తున్నారు. వీటితో పాటు పాలను కూడా చేర్చాలనే ఆలోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. పాలు నిల్వ ఉంటే పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉండటంతో.. ఈ సమస్యపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్జీవో, చైల్డ్ కేర్ సర్వీసు వర్కర్, టీఎన్-ఫోర్సస్ కన్వీనర్ కె. శణ్ముగవలేయుతమ్ మాట్లాడుతూ.. స్కూళ్లలో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పాలు అందించడం కొత్త ఐడియా కాదని అన్నారు. 20ఏళ్ల నుంచే ఈ విధానం ఉందని చెప్పారు. దీన్ని భరించలేక చాలా స్కూళ్లు అమలు చేయలేదన్నారు.
ఇప్పటివరకూ చాలా స్కూళ్లలో అంటు వ్యాధులు ప్రబలే పరిస్థితుల్లో పాలు నిల్వ చేయడం వల్ల పాడైపోయినట్టు గుర్తించామని ఆయన చెప్పారు. పాల నిల్వ కోసం ఎక్కువ నిధులు అవసరమన్నారు. స్కూళ్లకు పాలు ఎలా సరఫరా ఎలా అమలు చేస్తున్నారని అధికారులు అప్పుడప్పుడు సూళ్లను విజిట్ చేస్తుండాలని తెలిపారు. పి. సుందరమ్మల్ అనే మధ్యాహ్నా భోజన నిర్వహకురాలు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు ఫ్రూట్ జ్యూస్, బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు ప్రయత్నించిందని, కానీ, ఎక్కువ కాలం కొనసాగలేదన్నారు. పాల సరఫరా విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి మళ్లీ జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.