NEEM : సర్వ రోగ నివారిణి వేప! ప్రయోజనాలు తెలిస్తే?

అంటు వ్యాధులు సోకిన వారికి వాటి నుండి విముక్తి పొందేందుకు వేపాకులపై పడుకోబెట్టటం, వేపాకులు నీటి వేసి స్నానం చేయించటం వంటివి చేస్తారు. వేప చిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు పోతాయి.

NEEM : సర్వ రోగ నివారిణి వేప! ప్రయోజనాలు తెలిస్తే?

Neem (1)

Updated On : July 13, 2022 / 10:09 AM IST

NEEM : భారతదేశంలో వేపను ఆయుర్వేదం, గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తూ వస్తున్నారు. వేపలో ఆరోగ్యానికి తోడ్పడే ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక ఆరోగ్య దేవత. అందుకే దీనిని సర్వరోగ నివారిణిగా చెబుతుంటారు. వేప కొమ్మలను పళ్లు తోముకునేందుకు మాత్రమే ఉపయోగిస్తారని చాలా మందికి తెలుసు. అయితే వేప నుండి వివిధ రకాల ఉప ఉత్పత్తులను తీసి సబ్బులు, షాంపూలు, క్రీమ్, పేస్ట్ లు తదితర సౌందర్య సాధనాలలో సైతం ఉపయోగిస్తున్నారు. వేపకాయల గుజ్జును క్రిమి సంహారిణిగా పంటపొలాల్లో ఉపయోగిస్తున్నారు.

చర్మ రోగాలు, పేగుల్లో చేరిన పురుగులు, మధుమేహం వంటి వాటికి వేప ఔషధంగా పనిచేస్తుంది. సాధారణ వైరల్ సంబంధ జ్వరాల్లో వేప చెక్కను కషాయంగా కాచి అరకప్పు మోతాదులో తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. చర్మ వ్యాధులు కలిగినవారు వేపచెక్క పొడిని త్రిఫల చూర్ణంతో కలిపి చెంచాడు మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నులిపురుగులతో ఇబ్బందిపడేవారు చెంచాడు వేపాకు రసానికి అర చెంచా తేనె చేర్చి తీసుకుంటే సమస్య తొలగిపోతుంది. చుండ్రు సమస్యను సులభంగా వేప బెరడు, ఆకుల సాయంతో పోగొట్టుకోవచ్చు.

అంటు వ్యాధులు సోకిన వారికి వాటి నుండి విముక్తి పొందేందుకు వేపాకులపై పడుకోబెట్టటం, వేపాకులు నీటి వేసి స్నానం చేయించటం వంటివి చేస్తారు. వేప చిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు పోతాయి. పావు స్పూను వేపచెక్క చూర్ణంలో తగినంత పంచదార కలిపి ఉదయం, సాయంత్రం పాలతో తీసుకుంటూ ఉంటే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. పావు స్పూను వేపచెట్టు బెరడు చూర్ణాన్ని ఒక కప్పు నీటిలో కలిపి రాత్రంతా నానించి, ఉదయం ఆ నీటిని వడబోసి స్పూను తేనె కలిపి తాగితే మూత్రంలో ఇన్ ఫెక్షన్ పోతుంది.

వెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి, గాలి అందకుండగా గట్టిగా వస్త్రాన్నిచుట్టి ఉదయం వరకుంచిన, తలలోని పేల సమస్య వదిలిపోతుంది. కీళ్ళనొప్పుల నివారణకు వేపనూనెతో మర్ధన చేస్తుంటే క్రమేపీ కీళ్లనొప్పుల బాధ పోతుంది. రెండు కప్పుల నీటిలో నాలుగైదు వేపా కులు వేసి బాగా మరిగించి ముఖానికి ఆవిరి పట్టి గోరువెచ్చని నీటిలో ముఖం కడుక్కుంటే ముఖం జిడ్డుతనం పోయి నిగారింపు సంతరించుకుంటుంది.