Covid Booster Shot : కొవిడ్-19 బూస్టర్ డోసుతో 4 రెట్లు ఎక్కువ రక్షణ!
కొవిడ్-19 వేరియంట్లను నిరోధించాలంటే తప్పనిసరిగా బూస్టర్ డోసు అవసరం పడుతోంది. ఇప్పటికే చాలా దేశాలు బూస్టర్ డోసు అందిస్తున్నాయి.

New Israel Study Bolsters Case For Covid 19 Booster Shot
COVID-19 booster shot : కొవిడ్-19 వేరియంట్లను నిరోధించాలంటే తప్పనిసరిగా బూస్టర్ డోసు అవసరం పడుతోంది. ఇప్పటికే చాలా దేశాలు బూస్టర్ డోసు అందిస్తున్నాయి. అందులో అమెరికా సహా జర్మనీ, కెనడా, ఫ్రాన్స్ దేశాలు బూస్టర్ డోసులను అందిస్తున్నాయి. కొవిడ్ బూస్టర్ డోసుల సామర్థ్యంపై ఇజ్రాయెల్ కొత్త అధ్యయనం నిర్వహించింది. అందులో కొవిడ్ బూస్టర్ డోసు సమర్థవంతంగా ఇన్ఫెక్షన్ తగ్గిస్తుందని తేలింది.
కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో కంటే మూడో డోసుతో నాలుగు రెట్లు ఎక్కువగా రక్షణ కల్పిస్తుందని పరిశోధకులు నిర్ధారిచారు. ఇజ్రాయిల్ దేశంలో ఇటీవల అదనపు కోవిడ్ టీకాలను అందించారు. మూడో డోసు ఫైజర్ టీకాతో 60 ఏళ్లు దాటిన వారిలో కరోనా ఇన్‌ఫెక్షన్ గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. వ్యాక్సినేషన్ నిపుణుల కమిటీతో మంత్రిత్వశాఖ భేటీ జరిగింది. ఈ డేటాకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. డెల్టా వేరియంట్‌ను నిరోధించేందుకు అమెరికాతో పాటు పలు దేశాలు బూస్టర్ డోసులను ఇస్తున్నాయి.
Covid-19 Test : ఇంట్లోనే కొవిడ్ పరీక్ష! ధర తక్కువ.. గంటలోనే ఫలితం!
ఇజ్రాయిల్‌కు చెందిన హెల్త్ ప్రొవైడర్లు ఈ సర్వే నిర్వహించారు. బూస్టర్ డోసు వేసుకున్న 10 రోజుల తర్వాత వైరస్ నుంచి రక్షణ అధికంగా స్థాయిలో ఉందని గుర్తించారు. రెండు డోసులు వేసుకున్నివారిలో కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలిందన్నారు. 60 ఏళ్ల వృద్ధులు, ఆపైబడిన వారిలో వైరస్ నుంచి రక్షణ స్థాయి అధికంగా ఉన్నట్టు గుర్తించారు.
అదేవిధంగా 60 ఏళ్లు దాటిన వారిలో 10 రోజుల్లో వైరస్ నుంచి ఆరు రెట్లు రక్షణ పెరుగుతుందని అంచనా వేశారు. అందులో భాగంగానే ఇజ్రాయిల్‌లో జూలై 30వ తేదీ నుంచి మూడవ డోసు అందించారు. కొవిడ్ బూస్టర్ డోసును 40ఏళ్లు దాటిన వారికి కూడా అందించనున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. రెండవ డోసు తీసుకుని 5 నెలలు దాటినవారికి మాత్రమే మూడో బూస్టర్ డోసు అందిస్తున్నారు.