Healthy Fat Foods : అన్ని కొవ్వులు చెడ్డవి కావు! మీ ఆహారంలో చేర్చాల్సిన ఆరోగ్యకరమైన 5 కొవ్వు ఆహారాలు
కొవ్వులు, చర్మం, జుట్టు, మెదడు , రోగనిరోధక వ్యవస్ధకు మేలు చేస్తాయి. మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవటం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Healthy Fat Foods
Healthy Fat Foods : శరీరానికి తగిన మోతాదులో కొవ్వు అవసరం. గుండె ఆరోగ్యకరంగా ఉండేందుకు కొవ్వు పదార్థాలను తీసుకోవడంలో అపోహలు, అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. చెడుకొవ్వులు కలిగివుండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల, ఎక్కువ మోతాదులో కొవ్వు పదార్థాలను తినటంలో శరీరంలో కొవ్వు పెరుగుతుందనేది వైద్యులు చెప్పే మాట. కొవ్వు పదార్థాలు తీసుకుంటే నిజంగానే అనారోగ్యం దరిచేరుతుందా అంటే పోషకాహార నిపుణులు కాదనే చెప్తారు. ఎందుకంటే కొన్ని కొవ్వులు శరీరానికి , ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక పరిశోధనల్లోనూ ఇదే విషయం తేలింది. కొవ్వులు, చర్మం, జుట్టు, మెదడు , రోగనిరోధక వ్యవస్ధకు మేలు చేస్తాయి. మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవటం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన కొవ్వులు అందించే పదార్ధాలు కొన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
1. డార్క్ చాక్లెట్ ; ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వారానికి ఐదు సార్లు డార్క్ చాక్లెట్ తినే వ్యక్తులు గుండె జబ్బులతో చనిపోయే అవకాశం సగం కంటే తక్కువగా ఉంటుంది, మీ చర్మాన్ని ఎండ వల్ల దెబ్బతినకుండా కాపాడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
2. చేప ; చేపలలో ఒమేగా -3 కొవ్వులు ఎక్కువగా ఉంటాయి, అందుకే ఇది మెదడు, గుండె ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. విటమిన్లు D, B2 లు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. అదే సమయంలో, కాల్షియం మరియు భాస్వరం తగిన మొత్తంలో ఉంటుంది. ఇనుము, జింక్, అయోడిన్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలతో కూడా నిండి ఉంటుంది. ప్రతి వారం రెండు సేర్విన్గ్స్ చేపలను తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ట్రౌట్, సాల్మన్, మాకేరెల్, సార్డినెస్, హెర్రింగ్, తాజా ట్యూనా అన్ని రకాల చేపల్లో మంచి కొవ్వులు ఉంటాయి.
3. అవోకాడో ; అవోకాడోల్లో ఒలేయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆకలి బాధలను తీర్చడంలో సహాయపడే ప్రయోజనకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు కలిగి ఉంటుంది. ఒలీక్ యాసిడ్‌తో పాటు ఫైబర్ మరియు ప్రొటీన్లు ఉంటాయి. వాటిని కొద్దిగా మిరియాలు, ఉప్పుతో మసాలా కలుపుకుని తినవచ్చు. లేదా చిన్న ముక్కలుగా గా చేసి తీసుకోవచ్చు.
4. కొబ్బరి మరియు కొబ్బరి నూనె ; కొబ్బరి నూనె , కొబ్బరికాయలు రెండింటిలోనూ సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. కొబ్బరిలో కనిపించే కొవ్వు ఆమ్లాలలో 90 శాతం సంతృప్త కొవ్వులు ఉంటాయి. కొబ్బరి కాయలను ఎక్కువగా తినే వారిలో ఆరోగ్యం మెరుగుగా ఉండి గుండె సమస్యలు పెద్దగా ఉండవు.
5. చియా విత్తనాలు ; చియా గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అవి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తాయి. రక్తంలో ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారిలో చియా గింజల పిండి రక్తపోటును తగ్గిస్తుంది. ఈ ఆరోగ్యకరమైన విత్తనాలలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. చియా గింజలను స్మూతీస్‌లో చేర్చుకొని తీసుకోవచ్చు. మంచి పోషణ అందించే చియా విత్తనాలను సలాడ్ లో తీసుకోవచ్చు.
ప్రకృతి నుంచి తయారయ్యే సహజమైన ఆహారాల్లో మంచి కొవ్వులు ఉంటాయి. వీటిలో పాలీ, మోనో శాచ్యురేటెడ్ కొవ్వులు లభిస్తాయి. మంచి కొవ్వులు జీవక్రియను పెంచుతాయి. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి తోడ్పడతాయి. కొలెస్టరాల్ శాతాన్ని అదుపులో ఉంచుతాయి. టైప్-2 మధుమేహాన్ని తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోత్సహిస్తాయి.