Skin Beauty : వేసవిలో ఎండవేడి నుండి చర్మసౌందర్యాన్ని కాపాడే ఫేస్ పాక్స్!
ఓట్స్ తో వేసవిలో చర్మానికి మంచి ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. పొడి చర్మం ఉన్నవారికి ఈ ప్యాక్ మంచిది. పెరుగుతో కొంచెం ఓట్స్ ను మిక్స్ చేసి వాటిని మెత్తగా తయారు చేసుకోవాలి.

Pace Pack
Skin Beauty : ఎండాకాలం అధిక వేడి కారణంగా చర్మం నల్లబడటం, జిడ్డుగా మారటం వంటి సమస్యలు కనిపిస్తాయి. వేసవిలో జిడ్డు చర్మం, దుమ్ము, కాలుష్యం చర్మ సమస్యలను కలిగిస్తుంది. చర్మం తన సొగసైన ఛాయను కోల్పోతుంది. నల్లగా కనిపిస్తుంది. అధిక ఉష్ణోగ్రత,సూర్య కిరణాలతో, చర్మం దెబ్బతింటుంది. అకాల వృద్ధాప్యం కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే వేసవిలో చర్మాన్ని సౌందర్యవంతంగా ఉంచేందుకు కొన్ని ఫేస్ పాక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. చర్మఆరోగ్యానికి మేలు చేసే వేసవి ఏఫ్స్ ప్యాక్‌ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
చందనం ఫేస్ ప్యాక్: గంధం ఇది చర్మానికి చల్లదనాన్ని అందించడంలో సహాయపడుతుంది. మొటిమలు మరియు కురుపులను నివారిస్తుంది. కొంచెం గంధపు పొడిని తీసుకుని, రోజ్ వాటర్ ఉపయోగించి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై , చర్మంపై అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సొంతం చేసుకోవచ్చు.
నిమ్మరసం, దోసకాయ ఫేస్ ప్యాక్ ; 1 టీస్పూన్ దోసకాయ రసం, 1 టీస్పూన్ నిమ్మరసం తీసుకుని రెండు మిక్స్ చేయాలి. ఈ సమ్మర్ ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా, చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. దోసకాయ చర్మాన్ని టోన్ చేస్తుంది. దృఢంగా ఉంచుతుంది, అయితే చర్మాన్ని కాంతివంతం చేయటంలో నిమ్మరసం బాగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా చర్మంపై జిడ్డును తొలగిస్తుంది.
తేనె, నిమ్మరసం ఫేస్ ప్యాక్ ; గ్లో, ఫెయిర్‌నెస్, చర్మంపై జిడ్డు కంట్రోల్ కోసం ఇది బెస్ట్ సమ్మర్ ఫేస్ ప్యాక్ గా చెప్పవచ్చు. ఎక్కువసేపు సూర్యరశ్మిలో ఉండి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చర్మం రంగును సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. తేనె, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. చర్మం నిగారింపు కోల్పోకుండా ఉండాలంటే వేసవిలో ప్రతిరోజు దీనిని ప్రయత్నించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఓట్ మీల్, పెరుగు ఫేషియల్ ప్యాక్ ; ఓట్స్ తో వేసవిలో చర్మానికి మంచి ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. పొడి చర్మం ఉన్నవారికి ఈ ప్యాక్ మంచిది. పెరుగుతో కొంచెం ఓట్స్ ను మిక్స్ చేసి వాటిని మెత్తగా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ ఫేస్ ప్యాక్‌ని మెడ,ముఖం ఇతర శరీర భాగంలో అప్లై చేయాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి అనంతరం చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో తక్షణ మెరుపు వస్తుంది.
రైస్ ఫ్లోర్,పెరుగు వేసవి ప్యాక్ ; వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ మొదలైన వాటికి చికిత్స చేయడానికి బియ్యపు పిండి, పెరుగుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. బియ్యపు పిండి, పెరుగును సమాన మొత్తంలో కలిపి మృదువైన పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ చర్మంపై సమానంగా రాయాలి. 15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి.
బాదం పొడి, తేనె ప్యాక్ ; 4-5 బాదంపప్పులను రాత్రి నానబెట్టి, మరుసటి రోజు వాటిని తొక్కతీయాలి. వాటిని పాలతో గ్రైండ్ చేసి పేస్ట్‌గా చేసి, కొంచెం తేనె కలపాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాలు ఆరనివ్వాలి. అనంతరం చల్లని నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. చర్మం తెల్లబడటానికి ఈ ఫేస్ ప్యాక్ దోహదపడుతుంది.