Uric Acid : యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ పండ్లను తినకపోవటమే మంచిది?
ద్రాక్షలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సీ, ఫైబర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. అదే క్రమంలో వీటిలో ఫ్రక్టోజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగు ద్రాక్షలో ఫ్రక్టోజ్ ఉంటుంది.

People suffering from uric acid problem should not eat these fruits?
Uric Acid : అధిక యూరిక్ యాసిడ్ కీళ్ల చుట్టూ పేరుకుపోయి కీళ్ల నొప్పి, దృఢంగా మారటం, కదలలేని స్థితికి కారణమవుతుంది. ఇది చివరికి గుండె, మూత్రపిండాలు, ఇతర కీలకమైన అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది. యూరిక్ యాసిడ్ మన రక్తంలో కనిపించే వ్యర్థ పదార్థం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్’ అనే రసాయనం విచ్ఛిన్నం అయిన సందర్భంలో యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. విసర్జన సరిగా జరగకని క్రమంలో యూరిక్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమేపి అవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుంటాయి.
ఫ్రక్టోజ్ వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు ఫ్రక్టోజ్ కలిగిన ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాంటి వాటిలో అనేక పండ్లు, కూరగాయలు ఉన్నాయి. వాటిల్లో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల పండ్లను తినకుండా ఉండటమే మంచిది. యూరిస్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు తినకూడని పండ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అరటి పండు ; అరటిపండులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. అయితే, వీటిలో ఫ్రక్టోజ్ కూడా అధికంగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ అరటిపండులో 5.7 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది గౌట్, యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి అంత మంచిది కాదు.
పనస పండు ; పనసపండును చాలా మంది ఇష్టపడతారు. తియ్యాగా, రుచికరంగా ఉంటుంది. ఈ పండులో ఫ్రోక్టోజ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం, 1 కప్పు పనసతొనల్లో 15.2 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. యారిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు పనస పండు తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ప్రోక్టోజ్ స్థాయిల కారణంగా యూరిక్ యాసిడ్ సమస్య మరింత తీవ్రమౌతుంది.
యాపిల్ పండు ; యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. యాపిల్‌లో ఫైబర్, పాలీఫెనాల్స్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే యాపిల్ పండులో ఫ్రక్టోజ్ ఉంటుంది. గౌట్, యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు యాపిల్ తింటే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.
ద్రాక్ష పండ్లు ; ద్రాక్షలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సీ, ఫైబర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. అదే క్రమంలో వీటిలో ఫ్రక్టోజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగు ద్రాక్షలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ద్రాక్షలో రెస్వెరాట్రాల్, క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వారు ద్రాక్ష తినకపోవటమే మంచిది.
బ్లూ బెర్రీస్ ; బ్లూ బెర్రీస్‌లో ఫైబర్, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫ్రక్టోజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక కప్పు బ్లూబెర్రీస్‌లో 7.4 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. గౌట్, యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే బ్లూ బెర్రీస్ ఎక్కువగా తినటం ఏమాత్రం సరైనది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
పియర్ ; యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు పియర్ పండు ఎక్కువగా తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను మరింత పెంచుతుంది.