Health with family : సోషల్ మీడియాతో కాదు.. ఫ్యామిలీతో సమయం గడపండి.. ఆరోగ్యంగా ఉండండి

కుటుంబ సభ్యులతో కాస్త సమయం కేటాయించడానికి ఆలోచిస్తారు.. గంటల తరబడి సోషల్ మీడియాలో మునిగిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో సమయం గడిపితే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా అనుబంధాల వల్ల ఒత్తిడి, అనారోగ్యాలు కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.

Health with family : సోషల్ మీడియాతో కాదు.. ఫ్యామిలీతో సమయం గడపండి.. ఆరోగ్యంగా ఉండండి

Health with family

Health with family : బిజీ లైఫ్‌లో కుటుంబంతో ప్రత్యేకంగా గడపాలంటే చాలామందికి టైం కుదరదు. దొరికిన కాస్త టైం కూడా ఏవో అత్యవసర పనులకు కేటాయిస్తుంటారు. నిజానికి కుటుంబంతో సమయం గడపడం వల్ల ఆరోగ్యం బాగుంటుందట. ఈ మధ్యకాలంలో నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఫ్యామిలీతో కాస్త సమయం గడపడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారట.

Anger Management : కోపంతో ఉన్నప్పుడు నివారించాల్సిన 6 ఆహారాలు ఇవే !
ఈ మధ్యకాలంలో కుటుంబసభ్యులు కలిసి కూర్చుని  మాట్లాడుకునే వారు అరుదుగా ఉంటున్నారు. మాట్లాడాలన్నా, చూసుకోవాలన్నా అన్నీ సెల్ ఫోన్ లోనే. దానివల్ల కూడా డిప్రెషన్, ఆందోళనకు గురౌతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీతో కాసేపు కూర్చుని మాట్లాడటం వల్ల కొత్త ఉత్సాహం వస్తుందట. కుటుంబంతో సమయం గడిపే పిల్లలు సైతం స్కూల్లో చాలా యాక్టివ్ గా ఉంటారట. కూర్చుని మాట్లాడుకునేటపుడు అసలు స్కూల్లో వాళ్లు ఏం నేర్చుకుంటున్నారో పేరెంట్స్‌కి తెలియడంతో పాటు.. పిల్లల పట్ల మీరు ఎంత శ్రద్ధగా ఉన్నారో పిల్లలకు అర్ధమవుతుంది.

 

ఫ్యామిలీ మెంబర్స్‌తో సమయం గడపడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదైనా సమస్య వస్తే దానికి కుటుంబ సభ్యులు పరిష్కారం చూపిస్తారు. టీనేజ్ పిల్లలు ఉన్నట్లైతే వారు తీసుకునే కొన్నినిర్ణయాలపై పేరెంట్స్ సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా వారు ఒక్కోసారి ప్రమాదకరమైన దారిలో వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. ఎటువంటి సమస్యకైనా ఫ్యామిలీ మాత్రమే పరిష్కారం చూపగలదు అనే విషయం వారికి కూడా అర్ధం అవుతుంది. సమస్యల పరిష్కారానికి మార్గం చూపించడమే కాకుండా వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ నైపుణ్యాలను నేర్పుతుంది.

Laughing Yoga : లాఫింగ్ యోగా అంటే ఏమిటి? దీనిని ఎలా చెయ్యాలి?

కుటుంబంతో సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. చాలామందిలో అలసట, రక్తపోటు, శారీరక ఆరోగ్యంపై కూడా ఒత్తిడి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అన్నల్స్ ఆఫ్ బిహేవియరల్ మెడిసిన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఎక్కువగా కష్టాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకున్నప్పుడు పల్స్, మరియు రక్తపోటు రీడింగ్ తగ్గిందని తేలిందట. కాబట్టి ఫ్యామిలీతో సమయం గడిపితే ఆరోగ్యం కూడా బాగుంటుంది.

 

ఫ్యామిలీతో సమయం గడపడం వల్ల మీ బలం మీకు తెలుస్తుంది. మీపై మీరు శ్రద్ధ వహించడం.. మీకు మీరు తెలుసుకోగలుగుతారు. జీవితంలో ముందుకు సాగడానికి, ఎదగడానికి ఈ అనుభూతి ప్రేరణను ఇస్తుంది. ఇంట్లో వండిన భోజనం కుటుంబ సభ్యులతో కలిసి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. అలాగే కలిసి గేమ్‌లు, గార్డెనింగ్, అవుట్ డోర్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం వల్ల ఫిటెనెస్‌కు సహాయపడుతుంది. ఇది గుండె, మెదడు, హార్మోన్లు మరియు రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

Benefits of Tears : కన్నీళ్లు ఆరోగ్యకరమేనా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే ?

ఫ్యామిలీ మెంబర్స్‌తో సమయం గడపడం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవచ్చు. ఇంట్లో సంతోషంగా హాయిగా గడపడం వల్ల జీవితకాలం కూడా పెరుగుతుందట. ఎప్పుడూ సోషల్ మీడియా సైట్లలో అనుబంధాలను వెతుక్కుంటూ అనారోగ్యకరమైన జీవితంలో కూరుకుపోయే వారు ఒకసారి ఆలోచించండి. మన కుటుంబం మన శ్రేయస్సుని కోరుకుంటుంది. కాబట్టి సోషల్ మీడియా సైట్లలో గంటల తరబడి కేటాయించే సమయాన్ని ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపితే ఆరోగ్యం… ఆనందం.