Ramadan 2025 : రంజాన్ మాసంలో ఖర్జూరంతో ఉపవాసం ఎందుకు విరమిస్తారు? ఈ పండు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా వదిలిపెట్టరు!
Ramadan 2025 : ఖర్జూరంలో చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఉపవాసం తర్వాత శరీరంలో కార్బోహైడ్రేట్ల లోపాన్ని నియంత్రించవచ్చు. ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. మరెన్నో ఆర్యోగ ప్రయోజనాలు ఉన్నాయి.

Ramadan 2025
Ramadan 2025 Dates Health Benefits : రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం విరమించిన తర్వాత ఖర్జూరం పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. అయితే, ఈ ఖర్జూరం పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముస్లింలు ఈ నెలలో ఉపవాసాలు పాటిస్తారు.
ముఖ్యంగా ఇఫ్తార్ సమయంలో ఉపవాసం విరమించేందుకు తినే మొదటి పండు ఖర్జూరం. ఉపవాసం విడిచిపెట్టడానికి ఖర్జూర పండ్లు తినే సంప్రదాయం ఎప్పుటినుంచో ఉంది. ఇఫ్తార్‌లో ముఖ్యంగా ఖర్జూరాలను ఎక్కువగా తీసుకుంటుంటారు.
ఇఫ్తార్ సమయంలో ఖర్జూరం తినడం వల్ల శరీరానికి మంచి పోషణ లభిస్తుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఉపవాసం విడిచిపెట్టిన తర్వాత కడుపు తేలికగా ఉంటుంది. ఇఫ్తార్ సమయంలో మూడు నుంచి నాలుగు ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. బలహీనత తగ్గిపోతుంది. ఖర్జూరాలను ఎక్కువగా స్మూతీలు, లడ్డులు, పాన్‌కేక్‌ల వంటి ఆహారాలలో ఉపయోగిస్తారు. రంజాన్ సందర్భంగా ఖర్జూరం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఖర్జూరాలపై మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏమన్నారంటే? :
ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వైద్య నిపుణులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఖర్జూరంలో చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయని అనేక పరిశోధనలలో నిరూపితమైంది. ఉపవాసం తర్వాత శరీరంలో కార్బోహైడ్రేట్ల లోపాన్ని తగ్గిస్తాయి.
స్వీట్లు తినాలనే కోరికను నియంత్రిస్తాయి. ఆకలిని కూడా అదుపులో ఉంచుతాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇఫ్తార్ సమయంలో ఖర్జూరం తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఉపవాసం తర్వాత అతిగా తినాలనే కోరిక కలగదు. జీర్ణ రుగ్మతలు, ఇతర ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి :
ఖర్జూరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఉపవాసం సమయంలో శరీరాన్ని హీడ్రేషన్ కాకుండా నియంత్రిస్తుంది. అందుకే హైడ్రేటెడ్‌గా ఉంచే ఆహారాన్ని తీసుకోవాలి. రంజాన్‌లో సెహ్రీ నుంచి ఇఫ్తార్ వరకు ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా.
ఖర్జూరాలు జీర్ణక్రియకు మంచిది :
ఖర్జూరంలో ఉండే సాధారణ చక్కెరలు సులభంగా జీర్ణమవుతాయి. ఉపవాసం తర్వాత ఈ పండ్లను తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలతో ఉపవాసం విరమించడం వల్ల జీర్ణ సమస్యలను కూడా నివారించవచ్చు.
ఖర్జూరంలో యాంటీఆక్సిడెంట్లు :
ఖర్జూరంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. శరీరంలో మంటను తగ్గించడంలో సాయపడతాయి. జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేసేలా సాయపడతాయి. ఉపవాసం తర్వాత ఖర్జూరం తినడం ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
శరీరంలో శక్తిని పెంచుతుంది :
ఖర్జూరాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. సహజ చక్కెర, ఫైబర్ ఉంటాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, తగ్గుతాయి. మీరు రంజాన్‌లో ఖర్జూరాన్ని స్మూతీగా తయారు చేసుకుని తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్జూరం గింజలను తీసి పాలు, జీడిపప్పు, అరటిపండుతో కలిపి తింటే శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.