Father and Daughter : ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారట

తండ్రికి కూతురంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అయితే ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారట. కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

Father and Daughter : ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారట

Father and Daughter

Updated On : July 16, 2023 / 5:15 PM IST

Father and Daughter : తండ్రీ, కూతుళ్ళ అనుబంధం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఆడపిల్లకి తన తండ్రి సూపర్ హీరో. చిన్నతనం నుంచి తాను బాధ్యతలు తీసుకోవడం తెలుసుకునేంత వరకూ ప్రతి తండ్రి తన కూతురికి రక్షణ ఇస్తాడు. మార్గ దర్శకుడు అవుతాడు. అయితే కూతురు పుట్టినప్పుడు తండ్రి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అనే అంశంపై పరిశోధన జరిగింది. ఆ పరిశోధనలో ఏం తేలిదంటే?

Girl inspiring Video : ఆడపిల్లలకు చదువెందుకు? అన్న తండ్రికి కూతురి ధీటైన సమాధానం చూడండి

పిల్లలు తమ తల్లిదండ్రుల జీవితకాలాన్ని పెంచుతారంటే మీరు ఒప్పుకుంటారా? పోలాండ్‌లోని ‘జాగిలోనియన్ విశ్వవిద్యాలయం’ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం కొడుకులు తండ్రి ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపలేదట, అయితే కుమార్తెలు సానుకూల ప్రభావాన్ని చూపారట.  అంతే కాదు ఖచ్చితంగా తండ్రి జీవితకాలాన్ని 74 వారాలకు పెంచారట. ఈ అధ్యయనంలో 2,147 మంది తల్లులు, 2,163 మంది తండ్రులు పాల్గొన్నారట. ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ బయాలజీ’లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం కొడుకు, లేదా కూతురు ఇద్దరూ తల్లి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తారట. ఆమె జీవితకాలం తగ్గిస్తారట. ఒంటరిగా ఉండే మహిళలు సంతోషంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇక పిల్లలు లేకుండా ఉండాలని అనుకున్న జంటల కంటే.. పిల్లలతో ఉన్న జంటలు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని కూడా ఈ పరిశోధనల్లో తేల్చారట.

precious gift for father : తండ్రికి కొడుకు ఇచ్చిన విలువైన బహుమతి .. చూడగానే ఆ తండ్రి కన్నీరు ఆగలేదు..

ఈ అధ్యయనాలు ఎలా ఉన్నాఇప్పటికీ  సమాజంలో ఆడపిల్లలపై వివక్ష  కొనసాగుతోంది.  భారతదేశంలో స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ నిష్పత్తి దారుణంగా ఉంది. అందుకే భారత ప్రభుత్వం ‘బేటీ బచావో’, ‘బేటీ పడావో యోజన’ వంటి అనేక కార్యక్రమాలు కూడా చేపట్టింది. లింగ వివక్షను రూపుమాపేందుకు, భ్రూణ హత్యలను అరికట్టడానికి కఠినమైన చట్టాలు చేసింది.