Sago Rice : ఆరోగ్యానికి అమృతం సగ్గు బియ్యం

సగ్గుబియ్యం తేలికగా జీర్ణం అయ్యే ఆహారం కాబట్టి పాల తర్వాత చిన్న పిల్లలకి తినే ఆహారంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు. సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి ఉడికించి పాయసం చేసుకుని అందులో చక్కెర కలిపి తాగడం వల్ల కూడా జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

Sago Rice : ఆరోగ్యానికి అమృతం సగ్గు బియ్యం

Sago

Updated On : October 18, 2021 / 3:08 PM IST

Sago Rice : సగ్గు బియ్యాన్ని మనదేశంలో వివిధ రకాల వంటకాలలో వినియోగిస్తుంటారు. కర్ర పెండలం నుండి సగ్గు బియ్యాన్ని తయారు చేస్తారు. భూమి లో నుండి కర్రపెండలం తవ్వి తీసిన 24 గంటల లోపు సగ్గు బియ్యం తయారీకి వినియోగిస్తారు. చెరుకు నుండి చెరుకు రసాన్ని ఎలా తీస్తారో అదే తరహాలో కర్రపెండటం దుంపలను శుభ్రంచేసి వాటి నుండి పాలను తీస్తారు. పాలు చిక్కగా మారిన అనంతరం దాని నుండి జల్లెడ వంటి దానితో చిన్న చిన్న గుండ్రపు ఆకారంలో సగ్గు బియ్యాన్ని తయారు చేస్తారు.

సగ్గుబియ్యం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది. రసాయనాలు లేని న్యాచురల్ స్వీటనర్ కావడం వల్ల చాలమంది సగ్గు బియ్యాన్ని ఆహారంగా తీసుకునేందుకు ఇష్టపడతారు. కండరాల గ్రోత్ కి సగ్గుబియ్యం చాలా ఉపయోగపతాయి. వీటిలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ బిలు గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ కె మెదడుకి మంచిది.

విరోచనాలతో బాధపడుతున్నవారు ఈ సగ్గుబియ్యాన్ని నీటిలో నానబెట్టి, ఆ తరువాత నీటిలో ఉడికించి, కొద్దిగా చక్కెర కలుపుకుని తాగడం వల్ల విరోచనాలు త్వరగా తగ్గడమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అలాగే సగ్గుబియ్యాన్ని ఉడికించి తినడం వల్ల శరీరానికి కావలసిన ఫైబర్ అంది జీర్ణక్రియ సమస్యతోపాటు మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటును తగ్గించడంలో మొదటి పాత్ర వహిస్తుంది. వందగ్రాముల సగ్గుబియ్యంతో 20 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.

గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. దంతాలు, ఎముకలు పటిష్టంగా తయారయ్యేలా చేస్తుంది. రోజువారీ కాల్షియం అవసరాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. శరీరానికి కావలసిన ఐరన్ ను కూడా అందిస్తుంది. రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యలను కూడా దూరం చేస్తుంది. వారానికి రెండు సార్లు సగ్గుబియ్యాన్ని ఆహారంగా తీసుకోవటం వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. పెద్దలకు, పసి పిల్లలకు, సగ్గుబియ్యం అమృతంలా పనిచేస్తుంది.

సగ్గుబియ్యం తేలికగా జీర్ణం అయ్యే ఆహారం కాబట్టి పాల తర్వాత చిన్న పిల్లలకి తినే ఆహారంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు. సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి ఉడికించి పాయసం చేసుకుని అందులో చక్కెర కలిపి తాగడం వల్ల కూడా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. సగ్గుబియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు, వారి రోజూ వారీ ఆహారంలో సగ్గుబియ్యం చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో ఏర్పడిన అనారోగ్యకరమైన కొవ్వు శాతాన్ని తగ్గించటంలో సహాయకారిగా పనిచేస్తుంది.