Unlucky Number : 13 నంబర్ అంటే ఎందుకంత భయం? నిజంగానే అన్ లక్కీ నంబరా

13 నంబర్ అంటే జనం వణుకుతారు. 13 సంఖ్యతో ఇంటిని, వస్తువులను కొనరు. 13 అంటే జనాలకు ఎందుకంత భయం. నిజంగానే 13 అన్ లక్కీ నంబరా?

Unlucky Number : 13 నంబర్ అంటే ఎందుకంత భయం? నిజంగానే అన్ లక్కీ నంబరా

Unlucky Number 13

Updated On : August 5, 2023 / 4:53 PM IST

Unlucky Number : 13 ఈ నంబర్ వినగానే ఏదో భయం కలుగుతుంది. చాలా భవనాలు 13 నంబర్‌తో ఉండవు. 13 వ తేదీన పెళ్లి చేసుకోరు. అసలు ఈ 13 నంబర్ అంటే జనాలకు ఎందుకు హడల్.. అంటే ఇదో ఫోబియా అట. దానిపేరు ‘ట్రిస్కైడెకాఫోబియా’.

Non Engineering Student : గూగుల్‌లో జాబ్ కొట్టడం ఇంత ఈజీనా.. ఇంజనీరింగ్‌తో పనిలేదని నిరూపించిన డిగ్రీ స్టూడెంట్.. రూ. 50 లక్షల జీతం!

9 నుంచి 10 శాతం మంది అమెరికన్లు 13 నంబర్ అంటే భయపడతారట. 13 వ తేదీ శుక్రవారం అంటే మరింత భయపడతారు. అందుకు చాలా కారణాలు చెబుతారు. చరిత్రకారులు 13 నంబర్‌ను దురదృష్ట సంఖ్యగా చెప్పారు. న్యూమరాలజీ ప్రకారం 13 మంచి సంఖ్యగా చెబుతారు. దైవంతో ముడిపడిన సంఖ్యగా పరిగణిస్తారు. ఈ నంబర్ అదృష్టం, శ్రేయస్సును తెస్తుందంటారు. 13 నంబర్ చాలా మంచి మార్పును తీసుకువస్తుందని.. పాజిటివ్ దృక్పథానికి దారి తీస్తుందని చెబుతారు. అయినా ఈ నంబర్ అంటే భయాలు మాత్రం పోలేదు.

 

పురాతన సుమేరు కాలంలో నాగరికతలు 12 నంబర్ చుట్టూ అల్లుకున్నాయి. ఒక గడియారంలో 12 గంటలు, సంవత్సరంలో 12 నెలలు, రాశిచక్రంలో 12 దశలు. పన్నెండు అనేది పరిపూర్ణమైన సంఖ్యగా అనుసరిస్తున్న క్రమంలో 13 నంబర్‌లో లోపాలు కనిపించాయి. చాలామందికి 13 సంఖ్య అంటేనే భయం. చాలా అశాంతిని కలిగించే సంఖ్య అని భావిస్తారు.  నిజానికి ఈ సంఖ్యపై ఉన్న భయం పేరు ‘ట్రిస్కైడెకాఫోబియా’ . మూఢ నమ్మకం కారణంగా 13 సంఖ్య గురించి విపరీతమైన ఆందోళన చెందడమనేది ఈ ఫోబియా లక్షణం.

Snapchat Lense Rewards : మీ క్రియేటివిటీనే పెట్టుబడి.. స్నాప్‌చాట్ లెన్స్ క్రియేట్ చేస్తే చాలు.. నెలకు రూ. 6లక్షల వరకు సంపాదించవచ్చు..!

13 సంఖ్య చాలా అదృష్ట సంఖ్యగా చెబుతారు. ఇండియాలో చాంద్రమాన పక్షంలో 13 వ రోజు అత్యంత పవిత్రమైన త్రయోదశిగా పిలుస్తారు. ఇది శివునికి చెందినది.. దీర్ఘాయువును, శాంతి, అదృష్టాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు. ట్రిస్కైడెకాఫోబియా నుంచి బయటపడాలంటే ఆ వ్యక్తి తన ఆలోచనలను సంతోషంగా, సానుకూలంగా మార్చుకోవాలి. అలా అయితేనే  13 నంబర్‌తో ఉన్న ఆందోళనను అధిగమించగలరు. ధ్యానం, లోతైన శ్వాస, యోగా ద్వారా ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు.