Mood Swings : సడెన్‌గా మూడ్ మారిపోతోందా? ఈ కారణాలు కావచ్చు
కొందరు అప్పటిదాకా సంతోషంగా కనిపిస్తారు.. అంతలోనే విచారంగా అయిపోతారు. మరికొందరు నవ్వుతూ కనిపించి అంతలోనే తీవ్రమైన కోపం ప్రదర్శిస్తారు. ఈ మూడ్ స్వింగ్స్‌కి కారణం ఏంటి?

Mood Swings
Mood Swings : కొంతమంది అప్పటి వరకు సంతోషంగా ఉంటారు. అంతలోనే అకస్మాత్తుగా విచారంగా అయిపోతారు. అందుకు కారణం మూడ్ స్వింగ్స్.. అలాంటి వారితో ఎప్పుడు ఎలా ఉండాలో తెలియకపోవచ్చు. అసలు క్షణాల్లో మూడ్ మారిపోవడానికి కారణం ఏంటి?
friendship day 2023 : నిజమైన స్నేహితులు ఎలా ఉండాలో చెప్పిన మానసిక తత్వవేత్త .. మీరు అలా ఉన్నారా..?
నిద్రలేమి కూడా మూడ్ స్వింగ్స్‌కి కారణం కావచ్చునట. తగినంత విశ్రాంతి లేకపోతే ఆందోళనగా అనిపిస్తుంది. రోజంతా ఏకాగ్రతతో ఉండలేరు. సరిగా నిద్రపోని వ్యక్తులు ఇతరులపై ఎక్కువగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. సరైన నిద్ర లేకపోతే అది డిప్రెషన్ కు దారి తీస్తుంది. డయాబెటీస్ ఉన్నవారిలో ఆకస్మికంగా మూడ్ స్వింగ్స్ కనిపిస్తుంటాయి. ఆకలితో ఉన్నప్పుడు కోపంగా అనిపిస్తే బ్లడ్ సుగర్ లెవెల్స్ తగ్గడమే కారణమని చెప్పవచ్చు. కోపం, కలత, ఒంటరితనం, గందరగోళానికి కూడా దారి తీస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు సరైన సమయానికి ఏదైనా తింటే ఈ మూడ్ స్వింగ్స్ నుండి బయటపడతారు.
ఇంట్లో పని ఒత్తిడి ఉంటుంది.. ఉద్యోగంలోనూ ఒత్తిడి ఉంటుంది. అయితే దీర్ఘకాలిక ఒత్తిడి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఒత్తిడి వల్ల కూడా విచారంగా, కోపంగా, బాధగా అనిపిస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే వ్యాయామం చేయాలి. ఇది మంచి అనుభూతిని కలిగించడంలో సహాయపడుతుంది. మూడ్ స్వింగ్స్ లేదా డిప్రెషన్ కోసం వాడే డ్రగ్స్ కూడా దుష్ప్రభావాలను చూపిస్తాయి. అధిక మొత్తంలో స్టెరాయిడ్లు తీసుకుంటే కోపం ఎక్కువైపోతుంది. నిద్ర పట్టకపోవడం చాలా కష్టంగా అనిపించవచ్చును. మానసిక స్థితికి, మందులకి మధ్య లింక్ ఉంటుందని వైద్యులుచెబుతున్నారు.
Warning signs your home : ఇల్లు చిందరవందరగా ఉంటే మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందట
యుక్తవయసులో ఉన్నప్పుడు శరీరం హారోన్మల పెరుగుదలను ఉత్పత్తి చేసినప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. హార్మోన్ థెరపీ తీసుకున్నప్పుడు కూడా ఎటువంటి కారణం లేకుండా కలత చెందడం, కోపగించుకోవడం వంటివి కలుగుతాయట. ప్రెగ్నెన్సీ సమయంలో లేదా డెలివరీ తర్వాత హార్మోన్ స్ధాయి పడిపోయినపుడు కూడా మహిళలు డిప్రెషన్‌లోకి వెళ్తారు. వెంటనే చికిత్స అందితే త్వరగా బయటపడతారు.
కొందరు మహిళలు ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ కలిగి ఉంటారు. వీరిలో తలనొప్పి, తిమ్మిరి, మూడ్‌లలో విపరీతమైన మార్పులు ఉంటాయి. ఎప్పుడూ మూడీగా ఉంటారు. మెనోపాజ్ మొదలైన సందర్భంలో శరీరంలో హార్మోన్లు తక్కువగా పనిచేస్తాయి. దీనివల్ల నిద్ర సమస్యలు, మానసికంగా తెలియని ఆందోళన లక్షణాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం, ఎక్కువ నిద్ర, వ్యాయామం వంటి జీవనశైలి మార్పులు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
International kissing day 2023 : ముద్దులు .. ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక, శారీరక ఆరోగ్యాల రహస్యాలు
డిమెన్షియాతో బాధపడేవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అలాంటి వారు ఒక నిమిషం ప్రశాంతంగా, అంతలో కోపంగా ఉంటారు. తాము విషయాలను మరిచిపోతున్నామనే నిరాశకు గురవుతరు. ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వరు. హపరాక్టివిటీ డిజార్డర్ (ADHD) ఉన్నవారు కూడా చిన్న చిన్న విషయాలపై కోపం విసుగుతో ఉంటారు.వీరు చికిత్స ద్వారా నార్మల్ కావచ్చు. థైరాయిడ్ ఉన్నవారిలో కూడా మూడ్ స్వింగ్స్ కనిపిస్తాయి. కాఫీ, సోడా, కెఫిన్ , ఇతర పానీయాలు కూడా కూడా మానసిక స్థితిలో మార్పులు సూచిస్తాయి. 2 వారాలు లేదా అంతకు మించిన సమయం మూడ్ స్వింగ్స్‌తో ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా మానసిక వైద్యుడి సలహా, చికిత్స తీసుకోవడం మంచిది.