Dinner : రాత్రి డిన్నర్ త్వరగా చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

రాత్రి 7 గంటలలోపు రాత్రి భోజనం పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తేలికపాటి భోజనం చేయడం వల్ల నిద్ర బాగాపట్టటంతోపాటు, జీర్ణక్రియలు మెరుగవుతాయి. రక్తపోటును తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవు.

Dinner : రాత్రి డిన్నర్ త్వరగా చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

Quick Dinner

Updated On : June 1, 2022 / 10:45 AM IST

Dinner : రోజంతా వివిధ రకాల పనులతో బిజీగా గడిపేవారు రాత్రి సమయం ఇంటికి చేరి ప్రశాంతంగా ఆహారాన్ని అధిక మోతాదులో లాగించేస్తుంటారు. అయితే రాత్రి సమయంలో అధిక మోతాదులో ఆహారం తీసుకోవటం శరీరానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి భోజనం అనేది తక్కువమోతాదులో తేలికైన భోజనంగా ఉండాలి. అనారోగ్య జీవనశైలి ఫలితంగా, చాలామంది ఊబకాయం, గుండె జబ్బులు మరియు రక్తంలో చక్కెరతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతారు. వీటన్నింటికి కారణం రాత్రి సమయంలో అధిక మోతాదులో తినటమేనని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. రాత్రి సమయంలో అతిగా తినటం వల్ల ఎలాంటి శారీరక శ్రమలేకపోవటంతో తిన్న ఆహారం కొవ్వులు పెరగటానికి కారణమౌతాయి.

బ్లడ్ షుగర్ తోపాటు బరువును అదుపులో ఉంచుకోవడానికి నిద్రకు 3గంటలకు ముందే రాత్రి భోజనాన్ని తినేసేయాలి. ఆహారంలో కేలరీలతో సంబంధం లేకుండా, రాత్రి భోజనం ఆలస్యంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలతోపాటు బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అల్పాహారాన్ని రాజులా, మధ్యాహ్న భోజనం యువరాజులా, రాత్రి భోజనం పేదవాడిలాగా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

రాత్రి 7 గంటలలోపు రాత్రి భోజనం పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తేలికపాటి భోజనం చేయడం వల్ల నిద్ర బాగాపట్టటంతోపాటు, జీర్ణక్రియలు మెరుగవుతాయి. రక్తపోటును తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవు. బరువు తగ్గాలనుకునే వారు రాత్రి డిన్నర్ ను తక్కువ మోతాదులో తినటం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో రాత్రి వేళల్లో ఉపవాసాలు ఉండటం వల్ల శరీరంలోని కొవ్వులు కరిగి శక్తిగా మారతాయి. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది, నిద్రకు భంగం కలుగుతుంది. ఫలితంగా, తరచుగా మేల్కొవటం, నిద్రకు భంగం కలగటం వంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

మనం నిద్రపోతున్నప్పుడు, రక్తపోటు దాదాపు 10% పడిపోతుందని, శరీరం విశ్రాంతి మరియు కోలుకోవడానికి వీలు కల్పిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మేల్కొన్నప్పుడు, రక్తపోటు పెరగడం ప్రారంభమవుతుంది. ఆలస్యంగా రాత్రి భోజనం చేయడం రక్తపోటును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. నిద్రవేళకు 2-3 గంటల ముందు రాత్రి భోజనం చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.

ఆలస్యంగా రాత్రి భోజనం చేయడం వల్ల టైప్2మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. శరీరం ఇన్సులిన్‌ను సమర్ధవంతంగా ఉపయోగించలేనప్పుడు టైప్2 మధుమేహం వస్తుంది. నిద్రవేళకు 2-3 గంటల ముందు రాత్రి భోజనం చేయడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతుంది. రాత్రి వేళల్లో ఆలస్యంగా విందులు వల్ల గుండెల్లో మంట వస్తుంది. జీర్ణశయాంతర వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఛాతీలో మంట వంటి సమస్యలు వస్తాయి. రాత్రి భోజనం తొందరగా తినేవారికి యాసిడ్ రిఫ్లక్స్ , గుండెల్లో మంట వంటి సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.