Bone Health : ఈ అలవాట్లు ఎముకలను పెళుసుగా మార్చేస్తాయి !

శారీరక శ్రమ లేకపోవడం, ఎముక సాంద్రత మరియు కండరాల బలం తగ్గడానికి దారితీస్తుంది. ఎముకలు విరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. అనేక అధ్యయనాల్లో నిశ్చల జీవనశైలివల్ల ఎముక సాంద్రత తగ్గి బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరుగతున్నట్లు గుర్తించారు.

Bone Health : ఈ అలవాట్లు ఎముకలను పెళుసుగా మార్చేస్తాయి !

bones brittle

Updated On : October 20, 2023 / 12:36 PM IST

Bone Health : ప్రపంచ ఆస్టియోపోరోసిస్ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన జరుపుకుంటారు. బోలు ఎముకల వ్యాధి ,దాని నివారణ, రోగనిర్ధారణ , చికిత్స పై అవగాహన పెంచడం అన్నది ఈ రోజు జరుపుకోవటం యొక్క ముఖ్య ఉద్ధేశం. ఆస్టియోపోరోసిస్ దీనినే బోలు ఎముకల వ్యాధి అంటారు. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. దీని వల్ల ఎముకలు పెళుసుగా మారతాయి. పగుళ్లు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎముకల వ్యాధితో ప్రస్తుతం లక్షలాది మంది బాదపడుతున్నారు. తమకు తెలియకుండానే ఎముకలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో, వృద్ధాప్యంలో ఉన్నవారు ఎముకలు బలహీనంగా మారకుండా చూసుకోవటం చాలా ముఖ్యం.

READ ALSO : Supreme Court : సుప్రీంకోర్టులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ‌.. కారును పోలిన గుర్తులు తొల‌గించాలని వేసిన పిటిష‌న్ కొట్టివేత

ఎముకలు బలహీనంగా మార్చే చెడ్డ అలవాట్లు ;

ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ ప్రకారం, దాదాపు 36 మిలియన్ల మంది భారతీయులు బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. బోలు ఎముకల వ్యాధి వల్ల ఎముకలు గుల్లబారి విరిగిపోయే ప్రమాదాలకు దారితీస్తుంది. ఎముకల సాంద్రత, మొత్తం అస్థిపంజర బలాన్ని ప్రభావితం చేసే జీవనశైలి కారకాలను నిరోధించాలని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Mango Cultivation : మామి తోటల్లో పూత రావటానికి, వచ్చే సమయంలో చేపట్టాల్సిన చర్యలు !

1. తగినంత కాల్షియం తీసుకోవడం 

బలమైన ఎముకలకు కాల్షియం ఉపకరిస్తుంది. తగినంత కాల్షియం శరీరానికి అందకపోతే ఎముకలు బలహీనంగా మారతాయి. తగినంత కాల్షియం తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పాల ఉత్పత్తులను ఆహారంలో ప్రధాన భాగం చేసుకోవాలి. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ & మెటబాలిజంలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, 86% మంది భారతీయులు తగినంత కాల్షియం తీసుకోవడం లేదని తేలింది. తగినంత కాల్షియం తీసుకోకపోవటం ఎముక సాంద్రత తగ్గడానికి దారితీస్తుంది. దీంతో ఎముకల పగుళ్లు వచ్చే ప్రమాదాన్ని పెరుగుతుంది.

READ ALSO : Rahul Gandhi : టిఫిన్ బండి వద్ద దోసెలు వేసిన రాహుల్ గాంధీ .. జగిత్యాల పర్యటనలో ఆసక్తికర దృశ్యాలు

2. విటమిన్ డి లేకపోవడం 

విటమిన్ డి అనేది శరీరం కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. అది సరిగా లేకపోవతే ఎముకలు మీరు తినే ఆహారం నుండి కాల్షియంను సమర్థవంతంగా ఉపయోగించుకోలేవు. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజమ్‌లో జరిపిన పరిశోధనలో భారతీయులలో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. విటమిన్ డి లోపం కాల్షియం ఉత్పత్తిని తగ్గేలా చేస్తుంది. దీంతో ఎముకలు బలహీనతకు దారితీస్తుంది. తగినంత సూర్యరశ్మి , విటమిన్ డి ఆహార వనరులు ఎముకల బలానికి చాలా ముఖ్యమైనవి.

READ ALSO : Chandrababu : ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా.. అప్పటివరకు అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశం

3. నిశ్చల జీవనశైలి

శారీరక శ్రమ లేకపోవడం, ఎముక సాంద్రత మరియు కండరాల బలం తగ్గడానికి దారితీస్తుంది. ఎముకలు విరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. అనేక అధ్యయనాల్లో నిశ్చల జీవనశైలివల్ల ఎముక సాంద్రత తగ్గి బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరుగతున్నట్లు గుర్తించారు. కంప్యూటర్ జాబ్ లు , ఆఫీసు కార్యకలాపాలు వీటి పెరుగుదలకు కారణంగా మారుతోంది.ఇది ఎముకల ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

బోలు ఎముకల వ్యాధి నుండి ఎముకలను రక్షించుకోవడానికి, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తినడం, విటమిన్ డి తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి చర్యలు తీసుకోవడం మంచిది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు సలహాలు తీసుకోవటం మంచిది.