Prostate Cancer : ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి మగవారు తెలుసుకోవలసిన విషయాలు !
ప్రొస్టేట్ క్యాన్సర్ రావటానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తినే ఆహారం, స్థూలకాయం, ధూమపానం, రసాయనలకు గురికావటం, లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు, దీర్ఘకాలిక ధూమపానం వంటి ప్రమాదాన్ని పెంచుతాయి.

Prostate Cancer
Prostate Cancer : ప్రోస్టేట్ అనేది మగవారిలో ఉంచే ఒక చిన్న వాల్‌నట్ ఆకారపు గ్రంథి. వీర్య ద్రవాన్ని ఉత్పత్తి చేయటం దీని విధి. ప్రోస్టేట్ గ్రంధిలోని సాధారణ కణాలు నియంత్రణ లేకుండా పెరిగి కణితిగా ఏర్పడతాయి. దీనినే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా, సాధారణంగా గుర్తించబడిన క్యాన్సర్‌లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి మరియు పురుషులలో క్యాన్సర్ మరణానికి మూడవ ప్రధాన కారణం. భారతదేశంలో. ఈ వ్యాధితో ప్రతి సంవత్సరం దాదాపు 34 వేల కొత్త కేసులు మరియు 16 వేల మరణాలు సంభవిస్తున్నాయి.
READ ALSO : Spirulina Farming : స్పైరిలినా … ఒక్కసారి పెట్టుబడితో.. నెలకు లక్షల్లో ఆదాయం
ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది నిదానంగా పెరిగే తక్కువ స్థాయి కణితి. సరైన అవగాహన కలిగి ఉండటం, ముందస్తుగా దీని ప్రమాదాన్ని గుర్తించటం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు. పురుషులు ప్రొస్టేట్ క్యాన్సర్ విషయంలో కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
READ ALSO : Scotland : 5000 ఏళ్ల నాటి పురాతన సమాధి.. 14 అస్థిపంజరాలను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు
ప్రోస్టేట్ క్యాన్సర్ కలిగి ఉన్న వారిలో ప్రారంభదశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. తరువాత దశలో క్రమేపి లక్షణాలు బహిర్గతమవుతుంటాయి. ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్న వారిలో కనిపించే లక్షణాలకు సంబంధించి దిగువ కటి ప్రాంతంలో నొప్పి రావటం, తరచుగా మూత్ర విసర్జన, మూత్రవిసర్జనలో ఇబ్బందికలగటం, నొప్పి, మంట, మూత్రం వేగంగా రాకుండా నిధానంగా రావటం, మూత్రంలో రక్తం, స్కలనం సమయం నొప్పి, తుంటి బాగంలో నొప్పి, ఎముక నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రొస్టేట్ క్యాన్సర్ రావటానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తినే ఆహారం, స్థూలకాయం, ధూమపానం, రసాయనలకు గురికావటం, లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు, దీర్ఘకాలిక ధూమపానం వంటి ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వయస్సు పైబడిన వారిలో కనిపిస్తుంది. వంశపారపర్యంగా కుటుంబ చరిత్ర కలిగిన వారిలో కూడా వస్తుంది.
READ ALSO : Men’s Health : మగవాళ్లూ… ఈ టెస్టులు మరువకండి
వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత, 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ కు గురిఅవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రాథమిక దశలో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల మెరుగైన చికిత్సను అందించేందుకు అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్ ద్వారా రక్తంలో ప్రోస్టేట్-నిర్దిష్ట యాంటిజెన్ (PSA) స్థాయిలను పరీక్షించడం ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. డిజిటల్ మల పరీక్ష (DRE) వంటివి ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించే ఉత్తమ మార్గాలలో కొన్ని.
READ ALSO : Prostate Cancer Risk : మగవారిలో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు ! నివారణ చిట్కాలు
చికిత్స ప్రక్రియ ;
ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ప్రోస్టేట్‌కు మాత్రమే క్యాన్సర్ పరిమితమైనప్పుడు దానిని సమర్ధవంతంగా నయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శస్త్రచికిత్స లేదా రేడియోథెరపీతో చికిత్స చేస్తారు. వ్యాధి ఎముకలకు, ప్రోస్టేట్ వెలుపల ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే దానిని స్టేజ్ 4 క్యాన్సర్ గా పరిగణిస్తారు. ఇది నొప్పి మందులు, హార్మోన్ల చికిత్స, కీమోథెరపీ, రేడియోఫార్మాస్యూటికల్స్, ఫోకస్డ్ రేడియేషన్, ఇతర నోటి టార్గెటెడ్ థెరపీలతో చికిత్స చేస్తారు. ఈ చికిత్స ఫలితాలు అన్నవి వయస్సు, సంబంధిత ఆరోగ్య సమస్యలు,క్యాన్సర్ స్థాయిపై ఆధారపడి ఉంటుంది.
READ ALSO : Eating Too Much Fish : చేపలను ఎక్కువగా తినడం వల్ల పేగు ఆరోగ్యంపై ప్రభావంపడుతుందా ?
అసలు ఈ తరహా క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని రాకుండా నివారించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం మంచిది. మద్యపానం మానుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వైద్యులను కలసి వారి సూచనలు, సలహాలు పాటించాలి.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పొందటం మంచిది.