Summer Heat : వేసవిలో ఎండవేడి నుండి శరీరం చల్లబడాలంటే?…

వేసవి కాలంలో తీసుకోవాల్సిన ద్రవాల్లో మజ్జిగ కూడా ఒకటి. రోజులో తగినన్ని ఎక్కువ సార్లు మజ్జిగ తాగటం వల్ల శరీరం చల్లబడుతుంది.

Summer Heat : వేసవిలో ఎండవేడి నుండి శరీరం చల్లబడాలంటే?…

Summer Fruits

Updated On : March 10, 2022 / 10:49 AM IST

Summer Heat : వేస‌వి కాలంలో మ‌న శ‌రీరంలో నీరు ఇట్టే ఆవిరైపోతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. చెమట రూపంలో ఎక్కవ నీరు శరీరం నుండి బయటకు పోతంది. దీన్ని అధిగమించాలంటే ద్రవహారం ఎక్కవగా తీసుకోవాలి. వేస‌విలో సాధార‌ణం క‌న్నా కొంచెం ఎక్కువ‌గానే నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే నీటితోపాటు కింద సూచించిన పండ్లను కూడా ఈ సీజ‌న్ లో తినాలి. దీని వల్ల శ‌రీరంలో నీరు త‌గినంత ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఎండ దెబ్బ త‌గ‌ల‌కుండా ఉంటుంది.

వేసవిలో ఎక్కువగా లభించే సీజనల్ ఫ్రూట్స్ లో పుచ్చకాయ ఒకటి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన పండు. ఇందులోని లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బి6, సి, పొటాషియం, అమైనో యాసిడ్లు వంటివి వేసివిలో ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ సీజ‌న్‌లో తాటి ముంజ‌లు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న వేడి త‌గ్గిపోతుంది. శ‌రీరం చ‌ల్లబడుతుంది. అలాగే మ‌ల‌బ‌ద్దకం ఉండ‌దు. ముంజ‌ల్లో ఉండే కాల్షియం, ఐర‌న్‌, జింక్‌, కాప‌ర్‌, మెగ్నిషియం, సెలీనియం త‌దిత‌ర పోష‌కాలు శ‌రీరంలో ఉండే నీటి శాతం త‌గ్గకుండా చూస్తాయి.

వేసవిలో తప్పక తీసుకోవాల్సిన కూరల్లో కీర దోస ఒకటి. మనల్ని రోజంతా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కీర‌దోస‌లను తింటే శ‌రీరం చ‌ల్లబడుతుంది. శ‌రీరానికి త‌గినంత నీరు ల‌భిస్తుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. శరీరంలోని టాక్సిన్లను కూడా బయటకు పంపించేస్తుంది. నిమ్మరసం, ఉప్పు వేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ద్రాక్షల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని వేస‌విలో తింటే శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. అలాగే శ‌రీరం చల్లగా ఉంటుంది. వేస‌విలోపనిచేసి త్వరగా అలసి పోయేవారు స‌పోటా పండ్లను తింటే తక్షణ శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఒంట్లో ఉన్న నీరు త‌గ్గిపోకుండా ఉంటుంది.

వేసవి కాలంలో తీసుకోవాల్సిన ద్రవాల్లో మజ్జిగ కూడా ఒకటి. రోజులో తగినన్ని ఎక్కువ సార్లు మజ్జిగ తాగటం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి జలుబు,దగ్గు వంటి సాధారణ సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. వేసవిలో పుదీనాను వాడటం మంచిది. పెరుగులో కొద్దిగా పుదీనాను చేసి రైతాగా తీసుకోవచ్చు. వేసవిలో శరీర వేడిని తగ్గించటంలో ఉపయోగపడుతుంది.

వేసవిలో తీసుకోవాల్సిన పండ్లలో కర్భూజా కూడా ఒకటి. వేసవిలో తీసుకోవాల్సిన ఆహారాల్లో ఇది తప్పనిసరి చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో నీటి శాతం ఎక్కవగా ఉంటుంది. చెమట పట్టకుండా నివారిస్తుంది. కొబ్బరి బొండాం వాటర్ సైతం వేసవిలో శరీరాన్ని చల్లదనంతో ఉండేలా చేస్తుంది. శరీరంలో టాక్సిన్స్ నివారిస్తుంది. నిమ్మకాయ కూడా శరీరాన్ని వేసవి వేడి నుండి కాపాడుతుంది.

వేసవిలో ఉల్లిపాయను ఎక్కవగా తీసుకోవటం మంచిది. వడదెబ్బ తగలకుండా నిరోధిస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఎర్ర ఉల్లిపాయలో ఉండే క్విర్సిటిన్ వడదెబ్బ నుండి రక్షిస్తుంది. వీటన్నింటితోపాటు వేసవి కాలంలో ఎక్కువగా నీళ్లు తాగడం అత్యంతముఖ్యం. సీజనల్ ఫుడ్స్ ద్వారా ఎండ వేడి నుంచి తప్పించుకునే వీలుంటుంది.