Heart attack vs cardiac arrest : హార్ట్ ఎటాక్ v/s కార్డియాక్ అరెస్ట్ తేడా ఏంటంటే ?
గుండెపోటు లక్షణాలు అకస్మాత్తుగా కనిపించిస్తాయి. అయితే చాలా సందర్భాలలో కొన్ని తేలికపాటి లక్షణాలు రోజులు లేదా వారాల ముందు నుండి కనిపిస్తాయి. గుండెపోటు లక్షణాలు ప్రతి వ్యక్తికి, స్త్రీలు , పురుషులలో విభిన్నంగా ఉంటాయి.

Heart attack vs cardiac arrest
Heart attack vs cardiac arrest : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితం, జీవనశైలి , అనారోగ్యకరమైన అలవాట్ల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వివిధ రకాల తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటి వాటిలో గుండెపోటు కూడా ఒకటి. గుండెపోటు కేసులు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి. అయితే చాలా మందికి కార్డియాక్ అరెస్ట్ , హార్ట్ ఎటాక్ మధ్య తేడా అర్థం కాక గందరగోళంలో ఉంటారు. గుండెపోటుకు కారణం గుండెకు రక్త సరఫరాను అడ్డుకోవడం. అలాగే గుండె రక్తాన్ని పంపింగ్ చేయడం ఆపివేసినప్పుడు ఆ పరిస్థితిని కార్డియాక్ అరెస్ట్ అంటారు.
READ ALSO : Health Benefits of Okra : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయ ఒక్కటి చాలు !
కార్డియాక్ అరెస్ట్ మరియు గుండెపోటు మధ్య వ్యత్యాసం ;
గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి గుండె జబ్బులు, ఇవి రక్త ప్రసరణకు సంబంధించినవి. ధమనులలో రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల గుండెలోని ఆ భాగం పనిచేయటం నిలిచిపోతుంది. మరోవైపు, కార్డియాక్ అరెస్ట్‌లో, గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతుంది. అటువంటి పరిస్థితిలో వ్యక్తికి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది.
కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి?
కార్డియాక్ అరెస్ట్ అనేది అకస్మాత్తుగా సంభవిస్తుంది. దీనికి ముందు నిర్దిష్ట సంకేతాలు ఏమీ ఉండవు. ఇందులో గుండె శరీరంలో రక్తాన్ని పంప్ చేయడం నిలిచిపోయి వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకుంటాడు. ఈ పరిస్థితిలో, తక్షణ చికిత్స అందకపోతే కొన్ని నిమిషాల్లో చనిపోవచ్చు. గుండెపోటు , అసాధారణ హృదయ స్పందన కారణంగా కార్డియాక్ అరెస్ట్ ఎక్కువగా వస్తుంది.
READ ALSO : Heart Healthy : బీట్‌రూట్ , బచ్చలికూర జ్యూస్ తో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడే 5 పానీయాలు !
కార్డియాక్ అరెస్ట్ యొక్క లక్షణాలు ;
కార్డియాక్ అరెస్ట్ యొక్క అతి ముఖ్యమైన లక్షణం అపస్మారక స్థితి. అనేక సందర్భాల్లో గుండె ఆగిపోయే ముందు క్రింది కొన్ని సంకేతాలను ముందస్తుగా కనిపిస్తాయి. అవేంటంటే..
1.హృదయ స్పందన అసాధరణంగా ఉండటం
2.మైకము
3.ఛాతీ నొప్పి
4.శ్వాస సమస్య
5.వికారం, వాంతులు
READ ALSO : Protect Heart Health : మధుమేహాం సమస్యతో బాధపడుతున్న వారు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏంచేయాలంటే !
గుండెపోటు అంటే ఏమిటి?
ప్రస్తుతం రోజుకి వేలాది మంది గుండెపోటుకు గురవుతున్నారు. రక్తం గడ్డకట్టడం,గుండెకు రక్తం సరఫరా లేకపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. గుండెపోటు ఎక్కువగా కరోనరీ ధమనులలో అడ్డంకుల కారణంగా సంభవిస్తుంది, ఇది గుండెకు తీవ్రమైన హాని కలిగించడం ద్వారా వ్యక్తి మరణానికి దారితీస్తుంది.
గుండెపోటు యొక్క లక్షణాలు ;
గుండెపోటు లక్షణాలు అకస్మాత్తుగా కనిపించిస్తాయి. అయితే చాలా సందర్భాలలో కొన్ని తేలికపాటి లక్షణాలు రోజులు లేదా వారాల ముందు నుండి కనిపిస్తాయి. గుండెపోటు లక్షణాలు ప్రతి వ్యక్తికి, స్త్రీలు , పురుషులలో విభిన్నంగా ఉంటాయి.
1. ఛాతిలో అసౌకర్యం, ఛాతీ నొప్పి
2. శ్వాసకోస ఇబ్బంది
3. చెమటలు పట్టటం
4. హృదయ స్పందన వేగంగా ఉండటం
5.చేతులు, వీపు, మెడ, దవడ ,కడుపులో నొప్పి, తీవ్రమైన మంట , తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.