Good Bacteria : బరువును తగ్గించటంలో మంచి బాక్టీరియా పాత్ర ఎంతంటే?

పులియబెట్టిన ఆహారాలలో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మంచి బ్యాక్టీరియా అధికంగా ఉండే ఆహారంగా పెరుగును సూచించవచ్చు.

Good Bacteria : బరువును తగ్గించటంలో మంచి బాక్టీరియా పాత్ర ఎంతంటే?

Good Bacteria

Updated On : March 8, 2022 / 11:28 AM IST

Good Bacteria : ప్రతిమనిషి ఎదుర్కొనే అనేక అనారోగ్యసమస్యలకు కారణం బాక్టీరియా… వైర‌స్‌, ఇత‌ర సూక్ష్మ క్రిముల‌ని అంద‌రికీ తెలిసిన విషయమే.. బాక్టీరియా అన‌గానే వాటి వల్ల వ్యాధులు వస్తాయన్న అన్న అపనమ్మకంతో చాలా మంది ఉంటారు. వాస్తవానికి శరీరానికి చెడు చేసే బాక్టీరియా ఎలాగో, మంచి చేసే బాక్టీరియా కూడా ఉంటుంది. శ‌రీరంలోని జీర్ణాశ‌యం, పేగుల్లో ఈ మంచి బాక్టీరియా ఉంటుంది. మంచి బాక్టీరియా వ‌ల్లే తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

క్యాన్స‌ర్‌, గుండె జ‌బ్బులు రాకుండా చూడ‌డంలో, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలోనూ మంచి బాక్టీరియా దోహదపడుతుంది. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఊబకాయం. బరువు పెరగడం వల్ల అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర , అధిక కొలెస్ట్రాల్ వంటి ఉన్నాయి. అధిక శాతం మంది వీటితో నిత్యం సతమతమౌతున్నారు. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారికి మంచి బ్యాక్టీరియా ఎంతగానో మేలు చేస్తుంది. బరువు తగ్గడంలో ఇది సహాయకారిగా పనిచేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది.

మంచి బ్యాక్టీరియా మన శరీర బరువును తగ్గించడమే కాకుండా మన శరీరంలోని కొవ్వును కూడా తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లాక్టోబాసిల్లస్ అనే మంచి బాక్టీరియా శరీర బరువు మరియు పొట్ట కొవ్వును తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుందని శాస్త్రీయంగా రుజువైంది. పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలలో ఈ మంచి బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తుంది. అందుకే జీర్ణశాయ సమస్యలకు వైద్యులు పెరుగును ఎక్కువగా సిఫార్సు చేస్తారు. ఇందులో ఉండే లాక్టోబాసిల్లస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది

బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ స్థూలకాయాన్ని తగ్గించడానికి లాక్టోబాసిల్లస్ అనే మంచి బ్యాక్టీరియా ఎలా సహాయపడుతుందనే దానిపై నిర్వహించన అధ్యయనంలో మంచి బాక్టీరియా అధికంగా ఉన్న ఆహారాన్ని తినే మహిళలు, మంచి బ్యాక్టీరియా ఉన్న ఆహారాన్నితినని మహిళల కంటే బరువు వేగంగా తగ్గారు. అదే క్రమంలో మంచి బ్యాక్టీరియాతో కూడిన సప్లిమెంట్‌ను తీసుకున్న మహిళలు అధ్యయనం ముగిసిన తర్వాత బరువు తగ్గడం ప్రారంభించారు. అయితే ఈ తగ్గుదల పురుషులపై జరిపిన అధ్యయనంలో కనుగొనలేకపోయారు.

గతంలో 2013లో జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. లాక్టోబాసిల్లస్ అధికంగా ఉండే ఆహారాన్నితీసుకున్న అధిక బరువు ఉన్నవారు ఆతరువాత కాలంలో శరీర బరువులో మార్పులు వచ్చినట్లు గుర్తించారు. లాక్టోబాసిల్లస్ అధికంగా ఉండే ఆహారం తీసుకునేవారిలో 3 నుండి 4 శాతం కొవ్వు శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనం తేల్చింది. ఆహారాన్ని జీర్ణం చేయడంలో మంచి బ్యాక్టీరియా ఎంతగానో సహకరిస్తుంది. అదే సమయంలో ఈ మంచి బ్యాక్టీరియా మన శరీరానికి అవసరమైన పోషకాలు మరియు విటమిన్లను తయారు చేయడంలో చాలా సహాయపడుతుంది.

పులియబెట్టిన ఆహారాలలో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మంచి బ్యాక్టీరియా అధికంగా ఉండే ఆహారంగా పెరుగును సూచించవచ్చు. అలాగే జీర్ణంకాని చీజ్, యాపిల్ జ్యూస్‌తో తయారు చేసిన వెనిగర్, కిమ్చి మరియు మిసో మంచి బ్యాక్టీరియా కూడా పుష్కలంగా ఉంటాయి. మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియాను పెంచుకోవాలంటే చ‌క్కెర‌ను బాగా త‌క్కువ‌గా తీసుకోవాలి. వీలుంటే పూర్తిగా మానేయాలి. చ‌క్క‌ర వ‌ల్ల మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియా న‌శించి చెడు బాక్టీరియా పెరుగుతుంది. ఫ‌లితంగా బాక్టీరియా, వైర‌స్‌, ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఎక్కువ‌గా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

నిత్యం మ‌నం ఆరోగ్యంగా ఉండాల‌న్నా, ఉత్సాహంగా ప‌నిచేయాల‌న్నారోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. అయితే మ‌న శరీరంలో మంచి బాక్టీరియా పెర‌గాల‌న్నా నిత్యం క‌నీసం 7 నుంచి 9 గంట‌ల పాటు క‌చ్చితంగా నిద్రించాలి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే తాజా ఆకు కూర‌లు, కూర‌గాయ‌లు, పండ్లు త‌దిత‌ర ఆహారాల‌ను నిత్యం తీసుకున్నా మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. కొన్నిసార్లు మంచి బ్యాక్టీరియా కొన్ని రకాల సమస్యలను కలిగిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలెర్జీ సంబంధిత సమస్యలను కలుగుతాయి.  ఆసమయంలో వైద్యుడిని సంప్రదించటం ఉత్తమం.