Migraine Pain : మైగ్రేన్ నొప్పి.. చికిత్స ఏమిటంటే?
ఒత్తిడి, నిద్ర లేకపోవడం, వాతావరణంలో మార్పులు, బలమైన వాసనలు, పెద్ద శబ్దాలు, ప్రకాశ వంతమైన దీపాలు, ఆల్కహాల్, కెఫిన్ , చాక్లెట్ వంటి కొన్ని ఆహారాలు, పానీయాలు, హార్మోన్ల మార్పులు వంటివి కారణాలుగా చెప్పవచ్చు.

migraine
Migraine Pain : మైగ్రేన్లు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే చాలా సాధారణమైన తలనొప్పి. మైగ్రేన్ నొప్పి వ్యక్తులకు, వ్యక్తులకు మధ్య భిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే చికిత్స మాత్రం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. మైగ్రేన్లు ఒక రకమైన తలనొప్పి. తీవ్రమైన నొప్పి, వికారం, వాంతులు, కాంతి చూడలేకపోవటం , ధ్వనిని వినలేకపోవటం వంటి సమస్యలను కలిగిస్తుంది. తరచుగా అలసట, మానసికమైన మార్పులు , దృష్టి సమస్యలు వంటి ఇతర లక్షణాలు కలిగిస్తుంది.
READ ALSO : Migraines And Headaches : యోగా ఆసనాలతో మైగ్రేన్లు మరియు తలనొప్పికి అద్భుతమైన చికిత్స !
మైగ్రేన్‌లకు ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, అవి జన్యుపరమైన, పర్యావరణ కారకాల కలయిక వల్ల వస్తాయని భావిస్తున్నారు. న్యూ ఢిల్లీలోని ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ కన్సల్టెంట్ పెయిన్ ఫిజీషియన్ డాక్టర్ వివేక్ లూంబా సెరోటోనిన్,కాల్సిటోనిన్ జన్యు సంబంధిత (CGRPPides) వంటి న్యూరోట్రాన్స్‌మిటర్‌లను విడుదల చేసే ట్రైజెమినల్ నాడిని ఓవర్యాక్టివ్ గా నరాల కణాలు ప్రేరేపించినప్పుడు మైగ్రేన్‌లు వస్తాయని తెలిపారు. సెరోటోనిన్,కాల్సిటోనిన్ మెదడు యొక్క లైనింగ్‌లోపలి రక్త నాళాలలో వాపును కలిగిస్తుంది. నొప్పికి దారితీస్తుంది.
మైగ్రేన్‌లకు సాధారణమైన కొన్ని కారణాలు ;
ఒత్తిడి, నిద్ర లేకపోవడం, వాతావరణంలో మార్పులు, బలమైన వాసనలు, పెద్ద శబ్దాలు, ప్రకాశ వంతమైన దీపాలు, ఆల్కహాల్, కెఫిన్ , చాక్లెట్ వంటి కొన్ని ఆహారాలు, పానీయాలు, హార్మోన్ల మార్పులు వంటివి కారణాలుగా చెప్పవచ్చు.
READ ALSO : Sethu Bandhana Sarvangasana : మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే సేతు బంధన సర్వాంగాసనం!
మైగ్రేన్ చికిత్సలు ;
మైగ్రేన్‌లకు చికిత్స లేదు. అయితే వాటిని నివారించడానికి , ఉపశమనానికి సహాయపడే అనేక అంశాలు ఉన్నాయి. కొన్ని సాధారణ చికిత్సలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఓవర్-ది-కౌంటర్ మందులు : ఇబుప్రోఫెన్ , ఎసిటమైనోఫెన్ వంటి నొప్పి నివారణలు , ట్రిప్టాన్స్, ఎర్గోటమైన్‌ల వంటి ప్రిస్క్రిప్షన్ మందులు నొప్పిని తగ్గించడానికి నిపుణుల సిఫార్సుతో తీసుకోవచ్చు.
READ ALSO : పిల్లలను వేధించే మైగ్రేన్
సింగిల్-పల్స్-ట్రాన్స్‌క్రానియల్ మాగ్నెటిక్ స్టిమ్యులేషన్ : ఈ ప్రక్రియలో ఒక పరికరం తల వెనుక భాగంలో ఉంచుతారు. అది నొప్పిని తగ్గించగల అయస్కాంత శక్తిని పంపిస్తుంది.
బయోఫీడ్‌బ్యాక్ : ఇది హృదయ స్పందన రేటు, శ్వాస విధానాలు, కండరాల ప్రతిస్పందనల వంటి శరీరం యొక్క కొన్ని విధులను నియంత్రించడానికి ఉపయోగించే ఒక రకమైన సాంకేతికత.
READ ALSO : Migraine Pain : మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు, జాగ్రత్తలు!
రిలాక్సేషన్ టెక్నిక్స్: మెడిటేషన్ , యోగా అనేది శరీరానికి విశ్రాంతినిచ్చే వ్యాయామాలు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడతాయి.
పుష్కలంగా ద్రవాలు త్రాగటం : హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. ఇందుకోసం హెర్బల్ టీలను త్రాగటం వంటివి నొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది.
కొన్ని ఆహారాలు, వాసనలు,కాంతి ప్రేరితాలను నొప్పికి దారితీస్తాయి. వాటిని నివారించండి. మైగ్రేన్‌లతో బాధపడుతుంటే చికిత్స కోసం అనుగుణమైన పద్దతులను ఎంపిక చేసుకోవటానికి వైద్యుడిని సంప్రదించటం మంచిది.