ఐసోలేషన్ : ఇంటినుంచి పనిచేయాలంటే అత్యవసరమైనవి ఏంటి?

ప్రపంచదేశాల్లో కరోనా విజృంభిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతోంది. ముందుజాగ్రత్త చర్యగా ఎవరిని బయటకు రావద్దని భారత ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటినుంచి పనిచేయాలని సూచిస్తున్నాయి. ఆఫీసు వర్క్ ఇంట్లో నుంచే పూర్తి చేసేలా ప్రోత్సహాన్ని అందిస్తున్నాయి.
రోజుంతా ఇంట్లో ఉండి ఆఫీసు పనులను చక్కబెట్టే పనిలో ఉద్యోగులంతా నిమ్మగ్నమవుతున్నారు. వాస్తవానికి అందరికి వర్క్ ఫ్రమ్ హోం అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆఫీసుల్లో మాదిరిగా ఇంట్లో అన్ని సదుపాయాలు చాలామందికి ఉండొకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి ఇతర ఉద్యోగుల వరకు అందరూ ఇంటినుంచి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది.
ఇప్పుడు దేశవ్యాప్తంగా జనతా ఖర్ఫ్యూ అమల్లోకి వస్తోంది. అవసరమైతే భారత్ లాక్ డౌన్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అప్పటివరకూ ఇంట్లోనే ఉండాల్సిందే.. ఇంటి నుంచి ఆఫీసు పనులు సకాలంలో పూర్తిచేయాలంటే అసలు ఉండాల్సిన అత్యవసరమైన వస్తువులేంటి? ముందుగా అందరికి గుర్తుచ్చేది ఇంట్లో కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్.. ఈ రెండు ఆప్షన్లలో ఏది ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. ఇవి కాకుండా ఇంకేమి అవసరం.. అవేంటో ఓసారి చూద్దాం…
డెస్క్ టాప్ :
ఇంట్లో డెస్క్ టాప్ కంప్యూటర్లు ఉంటే పర్వాలేదు.. కానీ, అవసరమైన చోటుకు తీసుకెళ్లాలంటే కుదరదు.. తక్కువ ధరకే లభించే డెస్క్ టాప్ లు అందుబాటులో ఉంటున్నాయి. అత్యంత మోడ్రన్ డెస్క్ టాప్ లు ప్రధానంగా ఆఫీసు వర్క్ చేసుకోవచ్చు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. టవర్స్.. మానిటర్ కు అటాచ్ చేయొచ్చు. కీబోర్డు, మౌస్, ఆల్-ఇన్ వన్ వీటిన్నింటిని కంప్యూటర్ వెనుక కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆపిల్ ఐమ్యాక్, విండోస్ పీసీ అన్ని ఒకే రకమైనవి.
కొన్ని బేసిక్ స్పెషిఫికేషన్లు ఉండాల్సినవి :
* ప్రాసెసర్ : 9వ లేదా 10వ జనరేషన్ ఇంటెల్ i5 లేదా i7, AMD Ryzen 52500 లేదా ఇంటెల్ i3.
* ర్యామ్ : కనీసం 8GB వరకు కేపాసిటీ ఉండాలి.
* స్టోరేజీ : SSDతో 256GB స్టోరేజీ కనీసంగా ఉండాలి. కొన్ని మిషన్లలో HDDతో పెద్ద కేపాసిటీతో వస్తాయి.
Nvidia లేదా AMD రూపొందించిన ప్రత్యేకమైన గ్రాఫిక్స్ కార్డ్ ఉండేలా చూసుకోవాలి. క్రియేటీవ్ గ్రాఫిక్స్ ఇండస్ట్రీ పనిచేస్తుంటే.. ఈ మాత్రం కాన్ ఫిగరేషన్ ఉండాల్సిందే. ఫొటో లేదా వీడియో ఎడిటింగ్ చేసేవారికి ఈ కంప్యూటర్ కంపోనెంట్స్ ఉండాలి.
ల్యాప్ టాప్స్ :
ఇంటి నుంచే పనిచేసేవారికి ల్యాప్ టాప్ ఉండటం పెద్ద ప్రయోజకరమని చెప్పాలి. అది కూడా పోర్టబులిటీ అయితే ఇంకా బెంటర్. రోజుంతా ల్యాప్ టాప్‌పై పనిచేయాలంటే దానికి తగినట్టుగా కూర్చొనే విధానం, ఎత్తు అని తగినంతగా ఉండేలా చూసుకోవాలి. డెస్క్ లేదా కిచెన్ టేబుల్ ఎంతో అవసరం ఉంటుంది. ల్యాప్ టాప్‌ల్లో 2-1 డివైజ్ కీబోర్డు ఫోల్డ్ చేసుకోవచ్చు. కోబోర్డు నుంచి ట్యాబ్లట్‌గా మాదిరిగా వాడుకోవచ్చు.
ట్రేడేషనల్ ల్యాప్ టాప్స్ ఎంతో చౌకగా లభ్యమవుతున్నాయి. అప్పుడు 9వ లేదా 10వ జనరేషన్ ఇంటెల్ i5 లేదా i7 ప్రాసెసర్ ఉండాలి. కనీసం 8GB ర్యామ్ (16GB వరకు ఆప్షనల్) 256GB SSD స్టోరేజీ ఉండాలి. కీబోర్డు, ట్రాక్ ప్యాడ్ 13 నుంచి 14 స్ర్కీన్ వరకు ఉంటాయి. 1080p (1920 x 1200) ఒకే మాదిరిగా ఉండాలి.
మానిటర్ :
ఒకవేళ మీరు టవర్ డెస్క్ టాప్ కొంటున్నారా? మీకో మానిటర్ అవసరం. 24 అంగుళాల FULL HD 1080p డిస్‌ప్లే రిజుల్యుషన్ సరిపోతుంది. Quad HD, 1440p లేదా అంతకంటే తక్కువగా ఉన్నా పర్వాలేదు. పెద్ద మానిటర్లలో రిజుల్యుషన్ QHD ఉంటే బాగుంటుంది. 4K మానిటర్స్ అయితే లగ్జరీగా ఉంటాయి. థర్డ్ పార్టీ స్టాండ్ VESA కంపాటిబల్ (మ్యానువల్ లేదా స్పెషిఫికేషన్లు) లేదా స్టాక్ ఆఫ్ బుక్స్ వంటి ఉండేలా చూసుకోవాలి.
కీబోర్డు :
కోబోర్డులు ఎంతో చౌకైన ధరకే అందుబాటులో ఉంటున్నాయి. మంచి కీబోర్డు కోసం చూస్తుంటే USB లేదా వైర్ లెస్ వెర్షన్లను పొందవచ్చు. బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మోడ్రాన్ ల్యాప్ టాప్స్, డెస్క్ టాప్ లను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వైర్ లెస్ కీబోర్డులు కూడా బాగానే ఉంటాయి. కానీ బ్యాటరీలు అవసరం. రీఛార్జబుల్ బ్యాటరీలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
మౌస్ :
చేతికి నప్పేలా ఉండే మౌస్ తీసుకోండి.. ఫ్యాన్సీ లుకింగ్ మౌస్ ఫ్లాట్ పక్కన పెట్టండి.. ఎర్గోనామికలీ ఆకృతిలో లేదా వర్టికల్ మౌస్ ఉండేలా చూసుకోవాలి.. లేదంటే గంటల కొద్ది పనులుచేస్తుంటే మణికట్టు నొప్పివచ్చే అవకాశం ఉంటుంది.
నాయిజ్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్లు :
కంప్యూటర్ తర్వాత నాయిజ్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్లు అవసరం. ప్రత్యేకించి మీ హోం ఆఫీసుల్లో మాదిరిగా ఇంట్లో కిచెన్ టేబుల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో కాన్ఫిరెన్సింగ్ లేదా ఫోన్ కాల్స్, బుల్ట్ మైక్రోఫోన్లలో పనిచేస్తుంది. బోస్ QC35 II వ్యాపారానికి ఎంతో బాగుంటుంది. ఇయర్ ఎడ్ ఫోన్లు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
వెబ్ క్యామ్ :
వెబ్ క్యామ్ కూడా ఎంతో అవసరమే.. ఏదైనా అత్యవసరంగా ఆఫీసుకు సంబంధించి తోటి ఉద్యోగులతో లేదా బాస్ తో ఏదైనా చర్చించాలనుకుంటే ఈ డివైజ్ ఎంతో ఉపయోగపడుతుంది. వీడియో కాన్ఫెరెన్స్ కూడా పనిచేస్తుంది. హైయర్ ధర మోడల్స్ స్ట్రీమర్లు కూడా ఉన్నాయి.
సాఫ్ట్‌వేర్ :
మీ ఆఫీసుకు సంబంధించి ఏమైనా సాఫ్ట్ వేర్లు టూల్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. లేదంటే.. ఉచితంగా చాలా సాఫ్ట్ వేర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఈజీగా సాఫ్ట్ వేర్ వాడుకోవచ్చు.
డాక్యుమెంట్స్, స్ర్పెడ్ షీట్స్ :
వర్డ్ లేదా స్పెడ్ షీట్స్, గూగుల్స్ ఆన్ లైన్ డాక్స్ ష్యూట్ ఇవన్నీ బ్రౌజర్లలో సపోర్ట్ చేస్తాయి. ప్రత్యామ్నాయంగా మైక్రోసాఫ్ట్ ఫ్రీ ఆఫీసు ఆన్ లైన్ లేదా ఆపిల్ అందించే ఫ్రీ పేజెస్, షీట్స్ మ్యాక్ కు సపోర్ట్ చేస్తాయి.
ఇమేజ్ ఎడిటింగ్ :
చాలా కంప్యూటర్లలో బేసిక్ ఇమేజ్ ఆప్షన్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఫోటోస్, ఆపిల్ ప్రీవ్యూ లేదా ఫోటోలు. ఫ్రీగా GIMP (GNU ఇమేజ్ మానిపుల్యేషన్ ప్రోగ్రామ్) పవర్ ఫుల్ ఉంది. పెయింట్.నెట్ ఫీచర్ ప్యాకడ్ ఉన్నాయి. విండోస్, గూగుల్ ఫొటోలను బ్రౌజర్ లో వాడుకోవచ్చు.
వీడియో కాన్ఫిరెన్సింగ్ :
జూమ్, గూగుల్ చాట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ తోపాటు మెయిన్ కంజ్యూమర్ టూల్స్ మైక్రోసాఫ్ట్ స్కైప్, గూగుల్ డ్యుయో, ఆపిల్ ఫేస్ టైమ్ వంటి ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో చివరిది ఆపిల్ డివైజ్ ల్లో మాత్రమే పనిచేస్తుంది. ఫోన్ ఆధారిత మెసేజింగ్ యాప్స్ సిగ్నల్, వాట్సాప్, ఫేస్ బుక్ మెసేంజర్ లలో కూడా వీడియో చాట్ కూడా ఎంతో ఈజీగా వాడుకోవచ్చు.