Kadiyam Kavya : కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఖరారు..

కడియం కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ.. ఆమె బీఆర్ఎస్ టికెట్ ను తిరస్కరించారు.

Kadiyam Kavya : కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఖరారు..

Kadiam Kavya Mp Ticket

Kadiyam Kavya : వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కేటాయిస్తూ హైకమాండ్ నిర్ణయించింది. కడియం కావ్య ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. కాగా.. కడియం కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ.. ఆమె బీఆర్ఎస్ టికెట్ ను తిరస్కరించారు. కాంగ్రెస్ లో చేరారు.

తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను పెండింగ్ లో ఉంచిన కాంగ్రెస్.. ఇవాళ ఓ సెగ్మెంట్ కు అభ్యర్థిని ఖరారు చేసింది. ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయ్యింది. పెండింగ్ లో ఉంచిన నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అయితే, కేవలం ఒక అభ్యర్థిని మాత్రమే ప్రకటించారు. వరంగల్ లోక్ సభ స్థానానికి కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రకటన జారీ చేసింది. ఇక మూడు ఎంపీ స్థానాలు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ కు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య తన తండ్రితో కలిసి నిన్న కాంగ్రెస్ లో చేరారు. వాస్తవానికి ఆమెకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది.

అయితే, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపారు కడియం కావ్య. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్ కు ఓ లేఖ కూడా రాశారు. స్థానికంగా ఉన్న సమస్యలు, బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనతో పాటు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్న తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ లో చేరారు కావ్య. నిన్న కాంగ్రెస్ లో చేరిన కావ్యకు.. ఇవాళ టికెట్ కేటాయిస్తూ ప్రకటన చేసింది ఏఐసీసీ. మొత్తం మీద చూస్తే.. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకుగాను 14 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. మరో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Also Read : కోమటిరెడ్డివి రూ.3.50కోట్లు, రఘునందన్‌వి రూ.కోటి.. మాజీ డీసీపీ రాధా కిషన్‌ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు