Phone Tapping Case : కోమటిరెడ్డివి రూ.3.50కోట్లు, రఘునందన్‌వి రూ.కోటి.. మాజీ డీసీపీ రాధా కిషన్‌ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు, బంధువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేశామని ఒప్పుకున్నారు.

Phone Tapping Case : కోమటిరెడ్డివి రూ.3.50కోట్లు, రఘునందన్‌వి రూ.కోటి.. మాజీ డీసీపీ రాధా కిషన్‌ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 గా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఐఎస్ బీ మాజీ చీఫ్ ప్రభాకర్ ఆదేశాలతో ట్యాపింగ్ చేశామన్నారు. ఓ సిమెంట్ సంస్థ యజమాని నుంచి 70 లక్షలు సీజ్ చేశామని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు రాధా కిషన్ రావు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునందన్ రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్ల నుంచి కోటి రూపాయలు సీజ్ చేశామని రాధా కిషన్ ఒప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన రూ.3.50 కోట్ల సీజ్ చేసినట్లు రాధాకిషన్ తెలిపారు.

”2016లో ఓ వర్గానికి చెందిన అధికారులను ఏర్పాటు చేసుకున్నారు. నల్లగొండ నుంచి ప్రణీత్ రావు, రాచకొండ భుజంగరావు, సైబరాబాద్ వేణుగోపాల్ రావు, హైదరాబాద్ సిట్ తిరుపతన్నను నియమించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా రాధాకిషన్ ఉన్నారు. 8సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలించారు. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్, 2023 ఎన్నికల్లో BRS పార్టీకి డబ్బులు తరలించినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. బీఆర్ఎస్ గెలుపు కోసం స్పెషల్ పోలీస్ టీం కృషి చేసింది. టాస్క్ ఫోర్స్ టీమ్ కు వాహనాలు సమకూర్చారు మాజీ ఐఏఎస్. తన కులానికి చెందిన వారితో స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ లోని సిబ్బందిని బెదిరించి డబ్బులు సరఫరా చేయించారు మాజీ ఓఎస్డీ.

ఒక ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి ద్వారా డబ్బు తరలించారు రాధాకిషన్. 2023లో టాస్క్ ఫోర్స్ లో పని చేసిన ఇన్ స్పెక్టర్లు, సిబ్బంది డబ్బు పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. 8సార్లు పట్టుకున్న డబ్బు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదే అని తేలింది.

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను దర్యాఫ్తు చేశారు. తాజాగా అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ కు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు.

Also Read : వాళ్లకు భయం పట్టుకుంది.. ఫోన్ ట్యాపింగ్ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉత్తమ్