Pm Modi Telangana Tour : మరోసారి తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ

నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు స్థానాలు కవర్ అయ్యే విధంగా జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు.

Pm Modi Telangana Tour : మరోసారి తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ

Modi Telangana Tour

Pm Modi Telangana Tour : ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. రేపు(మార్చి 18) జగిత్యాలలో జరిగే విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు. నరేంద్రమోదీ.. ఆంధ్రప్రదేశ్ లో సభ ముగియగానే ఆయన హైదరాబాద్ వెళ్లనున్నారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో బస చేయనున్నారు. 7.50 కి బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు ప్రధాని మోడీ. 8 గంటలకు రాజ్ భవన్ చేరుకుని అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 10.10కు బేగంపేట విమానాశ్రయం మిగ్ 17 హెలికాప్టర్ లో జగిత్యాల వెళ్తారు.

11.15 కు జగిత్యాల విమానాశ్రయం చేరుకుంటారు

11.25 కు పబ్లిక్ మీటింగ్

11.30 నుండి 12.20 వరకు సభ వేదికపై గడపనున్న నరేంద్ర మోదీ

అనంతరం 1.30 కు హైదరాబాద్ చేరుకొని ప్రత్యేక విమానంలో కర్ణాటక వెళ్లనున్న ప్రధాని

నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు స్థానాలు కవర్ అయ్యే విధంగా జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. నరేంద్ర మోదీ రాక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సభ ప్రాంగణాన్ని SPG తమ ఆధీనంలోకి తీసుకుంది. SPG కనుసన్నల్లో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు స్ధానిక పోలీసులు. జగిత్యాలలో గతంలో PFI మూలాల బయటపడడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read : మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు, వాళ్ళ పార్టీనే ఖాళీ అవుతోంది- మల్లు రవి