Mallu Ravi : మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు, వాళ్ళ పార్టీనే ఖాళీ అవుతోంది- మల్లు రవి

చెడపకురా చెడేవు అన్న తరహాలో బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ కాలిపోతున్న ఇంటి లాంటిది. మేము అడగడం లేదు వాళ్ళే వచ్చి మా పార్టీలో చేరుతున్నారు.

Mallu Ravi : మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు, వాళ్ళ పార్టీనే ఖాళీ అవుతోంది- మల్లు రవి

Mallu Ravi On Brs

Mallu Ravi : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి స్పందించారు. కవిత్ అరెస్ట్ విషయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల పాలనకి కవిత అరెస్ట్ కి సంబంధం లేదన్న మల్లు రవి.. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది కాబట్టే కవిత అరెస్ట్ అయ్యిందన్నారు.

”తెలంగాణలో కాంగ్రెస్ 100 రోజుల పాలనకి ప్రాముఖ్యత ఉంది. 100 రోజుల్లో సెక్యులర్ డెమోక్రటిక్ పాలన పునరుద్దరిస్తామని, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చాం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సెక్యులర్ డెమోక్రటిక్ పాలన లేదు. కాంగ్రెస్ పాలనలో సెక్యులర్ డెమోక్రటిక్ పాలన పునరుద్ధరించడం ముఖ్యమైన అంశం.

సెక్యులర్ డెమోక్రటిక్ పాలన పునరుద్ధరించాం. మంత్రివర్గ నిర్ణయాల ద్వారా పాలన జరుగుతోంది. కలెక్టివ్ లీడర్ షిప్. సమిష్టి వృద్ధి. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేశాం. ధరణి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రజలు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులను కలవడానికి ప్రజా భవన్, సచివాలయం తలుపులు తెరిచాం. ప్రజలకి సేవకులుగా ప్రభుత్వం ఉంది. ఆర్ధిక క్రమశిక్షణ గాడిన పెట్టాం. 100 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం చేసిన పనులు చూసి.. దేశంలో, కేంద్రంలో తెలంగాణ మోడల్ లా కావాలని కోరుకుంటున్నారు.

బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో ఉంది. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ తో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. 100 రోజుల్లో ఒక్క తప్పు కూడా చేయలేదు. గుజరాత్ మోడల్ తెలంగాణకి కావాలని అడగలేదు. ప్రభుత్వ విధానం నెంబర్ 1గా తెలంగాణలో ఉంది. ఢిల్లీలో ఏపీ భవన్ విభజన పూర్తయింది. తెలంగాణ భవన్ డిజైన్స్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. సకల సదుపాయాలతో తెలంగాణ భవన్ నిర్మాణం ఉంటుంది. కేంద్రం ఇరు రాష్ట్రాల అధికారులతో కూర్చుని ఏపీ భవన్ విభజన ను కొలిక్కి తెచ్చింది. ఏపీ భవన్ విభజనకి కేంద్రం అంగీకరించింది. అదనంగా నూతన రాష్ట్రానికి ఇచ్చే భూమి అంశాల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా.

కవిత లిక్కర్ స్కాం లో ఉందని ఏడాది క్రితమే బీజేపీ ఎంపీలు చెప్పారు. లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అవుతున్నాయని ఇప్పుడే చెప్పలేము. లిక్కర్ స్కామ్ పై వివరాలు తెలుసుకుని కాంగ్రెస్ తన స్టాండ్ తెలుపుతుంది. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాలిపోతున్న ఇంటి లాంటిది. మేము అడగడం లేదు వాళ్ళే వచ్చి మా పార్టీలో చేరుతున్నారు. చెడపకురా చెడేవు అన్న తరహాలో బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు. వాళ్ళ పార్టీనే ఖాళీ అవుతోంది.

కాంగ్రెస్ లో చేరికలకు కారణం బీఆర్ఎస్ పార్టీనే. బీఆర్ఎస్ పార్టీ 100 రోజుల్లో వంద తప్పులు మాట్లాడి వాళ్ళ పార్టీ నేతలే పార్టీ వీడేలా చేసుకున్నారు. బీఆర్ఎస్ కి లోక్ సభ అభ్యర్థులు కూడా లేరు. పార్టీలో చేరడానికి, పోటీ చేయడానికి కూడా నేతలు లేరు. మేము గెలవకపోయినా పర్లేదు. కాంగ్రెస్ గెలవొద్దు అని కవిత అరెస్ట్ తో రాజకీయ డ్రామా జరుగుతోంది.

కేసీఆర్, కేటీఆర్ హరీశ్ రావు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన ఇవ్వలేదు. సచివాలయంలో 6వ ఫ్లోర్ లో కేటాయించిన సమయంలో సీఎంని కలవడానికి అనుమతి ఉంది. 18 గంటల పాటు పని చేస్తున్నాము కాబట్టే 100 రోజుల్లో చాలా పనులు చేశాం” అని మల్లు రవి అన్నారు.

Also Read : కేసీఆర్.. గంజాయి మొక్కలు నాటి వెళ్లారు.. ఒక్కొక్కటిగా పీకేస్తున్నాం