ఒక్క సినిమా.. ముగ్గురికి కమ్‌బ్యాక్..

  • Published By: sekhar ,Published On : July 18, 2020 / 03:00 PM IST
ఒక్క సినిమా.. ముగ్గురికి కమ్‌బ్యాక్..

Updated On : July 18, 2020 / 4:59 PM IST

గ‌త ఏడాది ఇదే రోజున విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయిన చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రమిది. స‌క్సెస్‌లు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న పూరీ జ‌గ‌న్నాథ్‌కి, హీరో రామ్‌కి తిరుగులేని క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. అంతే కాకుండా మ‌ణిశ‌ర్మను మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్‌లోకి తెచ్చిన చిత్ర‌మిది. ఈ సినిమా సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీసేశాడు.

iSmart Shankarసినిమా విడుద‌లైన ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ పూరి, హీరో రామ్ ట్విట్ట‌ర్ ద్వారా ప్రేక్ష‌కులకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ‘‘ఇస్మార్ట్ శంక‌ర్ విజ‌యం నాలో తిరిగి శ‌క్తిని నింపింది. న‌న్ను న‌మ్మి సినిమా చేసినందుకు రామ్‌కు కృత‌జ్ఞ‌త‌లు. నీతో ఉండ‌టం ప్ర‌తిరోజూ సెల‌బ్రేష‌నే. నిన్ను గ‌ట్టిగా హ‌త్తుకుని థ్యాంక్స్ చెప్పాల‌ని ఉంది. నువ్వు తురుం రా’’ అని పూరి ట్వీట్ చేశారు. iSmart Shankarఈ ట్వీట్‌కు రామ్ రిప్లై ఇస్తూ ‘‘నా గ‌న్ మిమ్మ‌ల్ని క‌లిసిన రోజు. మీరు ఇస్మార్ట్ శంక‌ర్‌ను నా ముందు ఉంచ‌టం నాకు మ‌రుపురాని రోజు. మ‌రెవ‌రూ చేయ‌లేని విధంగా న‌న్ను చూపినందుకు ధ‌న్య‌వాదాలు. ల‌వ్ యూ… మిమ్మ‌లి చూడ‌టానికి వేచి ఉండ‌లేక‌పోతున్నాను’’ అన్నారు. హీరోయిన్ నభా నటేష్ సహా పలువురు యూనిట్ సభ్యులు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు.