Poonam Panday : పూనమ్ పాండేపై రూ.100 కోట్లకు పరువు నష్టం కేసు.. ఆమె భర్తపై కూడా..
పూనమ్ పాండే ఇటీవల తను చనిపోయినట్లు చేసిన స్టంట్ తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై పూనమ్ ఆమె భర్త రూ.100 కోట్లు చెల్లించాలంటూ పరువు నష్టం దావా నమోదైంది.

Poonam Panday
Poonam Panday : క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం బాలీవుడ్ నటి పూనమ్ పాండే చేసిన స్టంట్ తెలిసిందే. తను సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయినట్లు బాంబు పేల్చి.. అదంతా ఉట్టిదేనంటూ మర్నాడు ప్రత్యక్షమయ్యారు. కాగా ఈ స్టంట్‌పై ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పూనమ్ ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్లకు పరువు నష్టం కేసు వేశాడు.
పూనమ్ పాండే.. సోషల్ మీడియా సెన్సేషన్.. తన బోల్డ్ వీడియోలు, ఫోటోలు, వ్యాఖ్యలతో వివాదాస్పదం అవుతుంటారు. ఇటీవల ఈ నటి తను సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయినట్లు వార్తను క్రియేట్ చేసి మర్నాడు ప్రత్యక్షమై అందర్నీ షాక్‌కి గురి చేసారు. క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో భాగంగానే తాను ఇదంతా చేసినట్లు వివరణ ఇచ్చారు. పూనమ్ చేసిన పనిని జనాలు తిట్టిపోశారు. మంచి ఉద్ధేశ్యంతో పూనమ్ చేసిన పని విమర్శల పాలైంది. తాజాగా ఈ ఘటనపై పూనమ్, ఆమె భర్త సామ్ బాంబేపై కాన్పూర్‌లో కేసు నమోదైంది.
Aishwarya Rajanikanth : ఐశ్వర్య ‘కొలవెరి’ పాటను అంత మాట అనేసిందేంటి? దాని వల్లే..
ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి పూనమ్ ఆమె భర్తపై కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పూనమ్ తన బూటకపు మరణ వార్తను క్రియేట్ చేసి క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాన్ని అపహాస్యం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పూనమ్ కేవలం తన వ్యక్తిగత ప్రచారం కోసమే ఈ స్టంట్ నిర్వహించి మిలియన్ల మంది భారతీయుల నమ్మకాన్ని వమ్ముచేసిందని ఆరోపించాడు. పూనమ్ ఆమె భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రూ.100 కోట్లు పరువు నష్టం చెల్లించాలంటూ ఫైజాన్ అన్సారీ తన ఫిర్యాదులో తెలిపాడు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారో తెలియాల్సి ఉంది.