10Max : ఓటీటీ రిలీజ్ అప్డేట్స్.. గుంటూరు కారం సెకండ్ సింగిల్.. ప్రభాస్ ‘కల్కి’ అప్డేట్..
కొత్త సినిమాల అప్డేట్స్, సెట్స్ మీదకెళ్లబోతున్న సినిమాలు, ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న చిత్రాలు అప్డేట్స్, ఓటీటీ రిలీజ్ అవ్వబోతున్న సినిమా అప్డేట్స్ వైపు ఒక లుక్ వేసేయండి.

10max Latest Entertainment News Today on 20 November
కొత్త సినిమాల అప్డేట్స్..
=> వెంకటేశ్, శైలేష్ కొలను కాంబినేషన్ లో సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న ‘సైంధవ్’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ‘రాంగ్ యూసేజ్’ని రేపు రిలీజ్ చెయ్యబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్.
=> గుంటూరు సెకండ్ సింగల్ నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తామంటూ నిర్మాత నాగవంశీ తెలియజేశారు.
=> ధనుష్ లీడ్ రోల్ లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ నుంచి ‘కిల్లర్ కిల్లర్’ సాంగ్ ఈ నెల 22న రిలీజ్ చెయ్యబోతున్నారు.
=> రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ్ రోల్స్ లో నటించిన ‘కోటబొమ్మాళి’ సినిమా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కింది. నవంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజవుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్.
=> స్మాల్ స్క్రీన్ స్టార్ సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు. సుధీర్ హీరోగా అరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కాలింగ్ సహస్ర’ సినిమాని డిసెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
=> నందమూరి చైతన్యకృష్ణ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ళ, నందమూరి జయకృష్ణ, బసవతారక రామ క్రియేషన్స్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’ డిసెంబర్ 2న గ్రాండ్ గా విడుదల అవ్వబోతోంది.
=> అశ్విన్ హీరోగా గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా అప్సర్ డైరెక్షన్ లో కొత్త సినిమా ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగింది. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘ఠాగూర్’ మధు, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు అటెండ్ అయ్యి టీమ్ కి బెస్ట్ విషెస్ అందించారు.
=> స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “ది ట్రయల్”. ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాను ఈ నెల 24న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు . ఈ సినిమా ట్రైలర్ ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు .
=> రాజారవీంద్ర లీడ్ రోల్ లో పద్మారావ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘సారంగదరియా’. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని హీరో రాజ్ తరుణ్ రిలీజ్ చేశారు.
=> కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఉపేంద్ర గాడి అడ్డా’ డిసెంబర్ 1న 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది.
Also read : Nani : హాయ్ నాన్న ప్రెస్ మీట్స్ అంటూ.. ఆంధ్రా తెలంగాణ లీడర్స్‌ని ఇమిటేట్ చేస్తున్న నాని..
సెట్స్ మీదకెళ్లబోతున్న సినిమాలు, ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న చిత్రాలు..
=> శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది.
=> చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా షూటింగ్ 23 నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. ఈ షెడ్యూల్ మారేడుమిల్లి అడవుల్లో స్టార్ట్ అవ్వబోతోంది.
=> ప్రభాస్ షూటింగ్ కి అటెండ్ కాకపోయినా.. షూటింగ్ కి మాత్రం ఎక్కడా బ్రేకుల్లేకుండా కంటిన్యూ చేస్తున్నారు నాగ్ అశ్విన్ అండ్ కో. 500కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ప్రభాస్ నాగ అశ్విన్ ‘కల్కి’ సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది.
=> ‘గుంటూరు కారం’ రిలీజ్ కి ఇంకా 2 నెలలు కూడా లేకపోవడం, షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో హర్రీఅప్ అంటున్నారు మహేశ్ బాబు. ప్రస్తుతం కోటి ఉమెన్స్ కాలేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. డిసెంబర్ 20 వరకూ నాన్ స్టాప్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ థర్డ్ వీక్ కి షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని ప్లాన్ చేస్తోంది టీమ్.
=> సెట్స్ మీదకెళ్లిన దగ్గరనుంచి చిన్న చిన్న బ్రేక్స్ తప్పించి ఎక్కడా ఆగని ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ.. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటుంది.
=> అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసుకుంటుంది.
=> గోపిచంద్, శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది.
=> నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’ సినిమా షూటింగ్ కాచిగూడలో జరుగుతోంది.
=> రవితేజ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈగల్.. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.
=> అక్కినేని నాగార్జున సినిమా ‘నా సామి రంగ’ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.
=> బాలకృష్ణ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఊటీలో.. యాక్షన్ షెడ్యూల్ ని జరుపుకుంటుంది.
ఈ వారం థియేటర్లు కంటే ఓటీటీలు ఆడియన్స్ ని ఎక్కువ ఎంగేజ్ చెయ్యబోతున్నాయి. మరి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న మోస్ట్ అవెయిటింగ్ మూవీస్ ఏంటో చూడండి.
=> ‘యానిమల్’ మూవీ టీంతో బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్ ఆహాలో నవంబర్ 24న స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణతో పాటు రణబీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి సందడి చేయబోతున్నారు.
=> లోకేశ్ కనగరాజ్, విజయ్ మోస్ట్ హైపెడ్ మూవీ లియో.. నవంబర్ 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్ కాబోతుంది.
=> హాలీవుడ్ మూవీ ‘ఓపెన్ హైమర్’ బుక్ మై షో యాప్ లో నవంబర్ 22 నుంచి స్ట్రీమ్ కాబోతోంది.
=> యూత్ లో సూపర్ ఫేమస్ అయిన ‘స్క్విడ్ గేమ్ ద చాలెంజ్’ వెబ్ సిరీస్.. నవంబర్ 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో టెలికాస్ట్ కాబోతోంది.